రీమేక్ దండయాత్రలు దశ మార్చవు… చిరుకి అభిమాని లేఖ…

Ads

స్వయంకృషితో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన ఘనత ఉన్న మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న పనులపై మనస్థాపన చెందిన అతని అభిమాని అతనికి ఓపెన్ గా లెటర్ రాశారు. ప్రస్తుత మా అభిమాని రాసిన లేక సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఏడుపదుల వయసుకు దగ్గర పడుతున్న ఏ మాత్రం స్పీడు తగ్గించకుండా కుర్ర హీరోలకు సైతం పోటీగా నటిస్తూ తెగ బిజీగా ఉన్న హీరో మీరు.. సినిమా వృత్తి అంటే ప్రాణం పెట్టే మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ అభిమాని ప్రశ్నిస్తున్నాడు.

సినిమాలో పెద్ద కంటెంట్ లేకపోయినా మీ డైలాగ్స్ తో సినిమాను రికార్డ్ స్థాయిలో హిట్ చేసే మీరు ఇలా గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి రీమేక్ చిత్రాలు చేయడం అవి సరిగ్గా అర్థం కాక యావరేజ్ గా మిగిలిపోవడం.. మీ నుంచి ఇది మేము ఆశించడం లేదు. ఆల్రెడీ యూట్యూబ్ లో తెలుగు వర్షన్స్ రిలీజ్ చేస్తుంటే మరో పక్క ఓటిటి లలో అన్ని భాషల చిత్రాలు వస్తుంటే…ఇంకా మీరు రీమేక్ కథలపై దండయాత్ర చేయడం ఎంతవరకు సబబు.

Ads

ఎంతో కంటెంట్ ఉన్న చిత్రాలు చెప్పే డైరెక్టర్లు రెడీగా ఉన్నప్పటికీ ఇలా ఉడికి ఉడకని రీమేక్ చిత్రాల లో మీరు నటించడం ఫాన్స్ కు ఎంతో బాధ కలిగిస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే డిజాస్టర్ అని చెప్పే ఆచార్య మూవీకి వచ్చిన కలెక్షన్స్ కూడా ఫైనల్ రన్ పూర్తయ్యాక భోళా శంకర్ కి వస్తాయి అని చెప్పడం కష్టమే. రీమేక్ చేస్తే సేఫ్ గా ఉంటాము అనుకుంటున్నారే తప్ప..స్ట్రైట్ గా వచ్చే మీ ఫ్లాప్ సినిమాలు ఇచ్చే కలెక్షన్స్ కూడా రీమిక్స్ ఇవ్వడం లేదు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు నటించారు కాబట్టి ఫస్ట్ డే రికార్డ్స్ ఫ్యాన్స్ గా మేము పెంచుతాం.. కానీ రెండవ రోజు పరిస్థితి ఏంటి.. థియేటర్లలో 30% ఆర్కే ఫ్యాన్సీ ఉండడమే కష్టం అయిపోతుంది.. బాస్ ఎంత అభిమానులైనా మనం చెప్పామని వినరు కదా..

Previous articleరియల్ లైఫ్ బేబీ నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
Next articleసినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోయిన్స్ గా సక్సెస్ కానీ సెల‌బ్రిటీ డాట‌ర్స్‌