గోపీచంద్ ఎందుకు పిల్లల విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా ఉంటాడు..?

Ads

హీరో గోపీచంద్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సినీ నేపథ్యం కుటుంబం నుండి వచ్చి తన టాలెంట్ తో అవకాశాలని పొందుతూ వచ్చాడు గోపీచంద్. సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు టి కృష్ణ తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాల్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలని పొందడానికి ఎంతగానో కష్టపడ్డాడు.

గోపీచంద్ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. తొలివలపు సినిమా ఫ్లాప్ అవడంతో గోపీచంద్ నిరాశ చెందారు. మళ్లీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి విలన్ గా కూడా నటించాడు గోపీచంద్. జయం సినిమాలో మంచి విధంగా నటించి గుర్తింపును తెచ్చుకున్నాడు. తర్వాత యజ్ఞం సినిమాతో హిట్ కొట్టాడు. గోపీచంద్ అప్పటి నుండి రణం, లక్ష్యం, లౌక్యం ఇలా ఎన్నో సినిమాలు చేశాడు.

Ads

ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ దర్శకత్వంలో రామ బాణం సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. మే 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని పంచుకున్నాడు.

అందరిలానే నా పిల్లలు కూడా స్కూల్ బస్సులో వెళ్తారు. వాళ్లకి ప్రత్యేక కార్ ఇచ్చి నేను పంపించనని హీరో చెప్పాడు. కష్టం విలువ డబ్బు విలువ పిల్లలకి కూడా తెలియాలి. డబ్బు ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు చేయకూడదు. అవసరానికి డబ్బుని ఇవ్వాలి. పొదుపుగా వాడుకోవడం పిల్లలకి నేర్పుతాను. డబ్బు విలువ కచ్చితంగా పిల్లలకు తెలియాలి. అందుకే నేను ఈ విషయంలో నా పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉంటానని గోపీచంద్ చెప్పాడు.

Previous articleఅపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో ఏసీ ఎందుకు లేదు..? కారణం ఏమిటి అంటే..?
Next articleఇంగ్లీష్ లో మాట్లాడి.. విపరీతమైన ట్రోల్స్ కి గురైన సెలెబ్రెటీలు వీళ్ళే..!