2022 లో టాలీవుడ్ లో వచ్చిన 10 రీమేక్ చిత్రాలు.. వాటిలో హిట్లు ఎన్ని, ప్లాపులు ఎన్ని?

Ads

ప్రతి సంవత్సరం రీమేక్ మూవీస్ విడుదల అవుతూ ఉంటాయి. రీమేక్ అంటే ఒక భాషలో హిట్ అయిన మూవీని మరో భాషలో తీయడమే అని అనుకుంటారు. ఇది వాస్తవమే అయినా ఒక హిట్ మూవీని రీమేక్ చేయగానే హిట్ అవుతుందనుకోవడం తప్పు.

ఎందుకంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష ఉంటుంది. భాషకి తగ్గట్టు భావం కూడా వేరుగా ఉంటుంది. అలాగే వివిధ రాష్ట్రాలలో ఉండే ప్రజల అభిరుచులు కూడా వేరుగా ఉంటాయి. అందువల్ల ఆ రాష్ట్ర నేటివిటీకి తగ్గట్టు రీమేక్ లు చేయాల్సి ఉంటుంది. ఇక కరోనా తరువాత సినీ పరిశ్రమకు ప్రేక్షకులు గుణపాఠం నేర్పారు. ఓటీటీల్లో వివిధ భాషల సినిమాలు చూస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం రీమేక్ అయిన చిత్రాల్లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మరి ఆ రీమేక్ సినిమాలు ఏమిటో చూద్దాం..
1. భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్, రానా నటించిన ఈ సినిమా, మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కి రీమేక్ గా వచ్చింది. మొదటి రోజు హిట్ టాక్ వచ్చినా కూడా యావరేజ్ తో సరిపెట్టుకుంది.2.గాడ్ ఫాదర్ :
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా మలయాళం చిత్రం ‘లూసిఫర్’ కి రీమేక్ గా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

Ads

3. శేఖర్ :
మలయాళంలో రూపొందిన ‘జోసెఫ్’ రీమేక్ కు రాజశేఖర్ హీరోగా వచ్చిన ఈ మూవీ. ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా, పెద్ద ప్లాప్ గా మిగిలింది.4.గాడ్ సే :
సత్యదేవ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ‘ది నెగోషియేషన్’ అనే కొరియన్ సినిమాకి రీమేక్. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
5. దొంగలున్నారు జాగ్రత్త :
సముద్ర ఖని, సింహ కోడూరి, ప్రీతి అస్రాని నటించిన ఈ మూవీ ‘4*4’ అనే స్పానిష్ సినిమాకి రీమేక్ గా వచ్చింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది.
6.శాకిని డాకిని :
నివేదా థామస్, రెజీనాలు నటించిన ఈ చిత్రం, కొరియన్ సినిమా అయిన ‘మిడ్ నైట్ రన్నర్స్’ కు రీమేక్ గా వచ్చింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది.
7. ఓరి దేవుడా :
వెంకటేష్, విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో హిట్ అయిన ‘ఓ మై కడవులే’సినిమాకి రీమేక్.ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
8. ఉర్వశివో రాక్షసివే :
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమా తమిళ సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’ రీమేక్ గా వచ్చింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది.
9.గుర్తుందా శీతాకాలం :
సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి నటించిన ఈ సినిమా కన్నడ మూవీ‘లవ్ మాక్టైల్’ రీమేక్ గా వచ్చింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది.
10.అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి :
నరేష్, అలీ, పవిత్ర నటించిన ఈ సినిమా మలయాళం సినిమాగా వికృతికి రీమేక్ గా వచ్చింది. అయితే ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. దాంతో మూవీ ఫలితం ఏమిటనేది తెలీదు.
Also Read: ఆ హీరోయిన్‌ కోసమే ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవ పడ్డారా?

Previous articleఈ ఏడాది బాలీవుడ్‌లో తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎంత వసూలు చేసాయంటే?
Next articleగుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాస్య నటి కోవై సరళ.. ఫోటో వైరల్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.