Ads
సినిమా అన్నాక తీసిన ప్రతిదీ హిట్ అవ్వాలి అన్న గ్యారెంటీ ఎక్కడా లేదు. కొన్ని ఊహించని విధంగా సూపర్ డూపర్ హిట్ అయితే మరికొన్ని భారీ అంచనాలతో విడుదలైన ఫ్లాప్ అవుతాయి. అయితే హీరో హీరోయిన్లకు మూవీ ఫ్లాప్ ,హిట్స్ తో ఎప్పుడు సంబంధం ఉండదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఫ్లాప్ అయితే ఎక్కువ శాతం నష్టం భరించేది నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్స్.
అయితే కొందరు స్టార్స్ ఊహించని విధంగా తమ సినిమాలు డిజాస్టర్ అయితే తాము తీసుకున్న నిర్ణయం డబ్బులను తిరిగి ఇవ్వడం లేకపోతే ఆ నిర్మాతకు సంబంధించిన మరొక సినిమాను డబ్బులు తీసుకోకుండా చేయడం లాంటివి చేస్తుంటారు. అలా తీసుకున్న డబ్బులు వెనక్కు ఇచ్చిన నటీనటులు ఎవరో తెలుసుకుందాం.
.1. సూపర్ స్టార్ కృష్ణ
ఎన్నో సినిమాలు నటించి రికార్డు సృష్టించిన స్టార్ హీరో కృష్ణ రియల్ లైఫ్ లో కూడా ఎంతో దయార్థ హృదయుడు. ఎన్నో సందర్భాలలో సినిమా బోల్తా కొట్టినప్పుడు కృష్ణ తాను తీసుకున్న రమ్యునరేషన్ను వెనక్కి ఇచ్చేశారు. అందుకే అప్పట్లో నిర్మాతలు కృష్ణను రియల్ హీరో అనేవారు.
2. రజనీకాంత్
రజనీకాంత్ నటించిన బాబా మూవీ అనుకోని విధంగా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. భారీ నష్టాన్ని చవిచూసిన నిర్మాతకు రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ లో చాలా భాగాన్ని వాపస్ ఇచ్చేశారు.
3. బాల కృష్ణ
బాలకృష్ణ నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో బాలయ్య బాబు తన పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేశారు.
Ads
4. పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ నటించిన జానీ, కొమురంపులి అంచనాలను మించి డిజాస్టర్ గా మారాయి. దీంతో భారీగా నష్టాన్ని చవిచూసి తలకిందులైన ప్రొడ్యూసర్ల పరిస్థితి గమనించి తాను తీసుకున్న రమ్యునరేషన్ను పవన్ వెనక్కి ఇచ్చేశారు.
5. రవితేజ
మాస్ మహారాజు హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దాంతో రవితేజ తను తీసుకున్న పారితోషకం మొత్తం వెనక్కి ఇచ్చేశారు.
6. మహేష్ బాబు
టాలీవుడ్ మోస్ట్ సింపుల్ హీరో మహేష్ బాబు ఖలేజా మూవీ బాక్సాఫీస్ వద్ద తడబడి నిర్మాతలకు నష్టాన్ని మిగలచడంతో తన రెమ్యూనరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చేశారు.
7.రామ్ చరణ్
రామ్ చరణ్ మరియు జెనీలియా కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఆరెంజ్ భారీ నష్టాలను చవిచూసింది. కెరియర్ తొలి దశ అయినప్పటికీ ఎంతో సహోదయంతో రామ్ చరణ్ తాను తీసుకున్న పారితోషకాన్ని తిరిగి ఇచ్చేశారు.
8. జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు అనే మూవీ ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. దీంతో ఎన్టీఆర్ను తిరిగి ఇచ్చేశారు.
9. సాయి పల్లవి
సాయి పల్లవి మరియు శర్వానంద్ కాంబినేషన్లో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ అవ్వడంతో సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ను వెనక్కు ఇచ్చేసింది.
10. సమంత
సమంత రీసెంట్ గా నటించిన చారిత్రాత్మక ప్రేమ కథ చిత్రం శాకుంతలం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో సామ్ తన పారితోషకం మొత్తం రిటర్న్ ఇచ్చేసింది.