హీరోయిన్ల ని పెళ్లి చేసుకున్న 9 మంది క్రికెటర్స్ వీళ్ళే..!

Ads

హీరోయిన్లు ఎక్కువగా హీరోలని కానీ లేదంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులని కానీ పెళ్లి చేసుకుంటుంటారు. అలానే కొంతమంది హీరోయిన్లు క్రికెటర్స్ ని కూడా పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. చాలా మంది క్రికెటర్లు సినీ నటుల ప్రేమలో పడడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి హీరోయిన్ లని పెళ్లి చేసుకుని క్రికెటర్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

  1. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిళా టాగోర్:

క్రికెటర్ నటిని పెళ్లి చేసుకోవడం అనేది మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిళా టాగోర్ నుండే స్టార్ట్ అయ్యింది. ఆ తరవాత చాలా మంది అలా తారల్ని పెళ్లి చేసుకున్నారు. 1969లో వీళ్ళ పెళ్లి జరిగింది. వీళ్ళ కొడుకే సైఫ్ అలీఖాన్.

2. అజారుద్దీన్, సంగీత బిజ్లానీ:

హిందీ నటి, మిస్ ఇండియా సంగీత బిజ్లానీ ని అజారుద్దీన్ పెళ్లి చేసుకున్నారు. అజారుద్దీన్, సంగీత బిజ్లానీ ల పెళ్లి 1996లో అయ్యింది.

3. హర్భజన్ సింగ్, గీత బస్రా:

బాలీవుడ్ అందాల తార గీత బస్రా తో హర్భజన్ సింగ్ పెళ్లి జరిగింది. అయిదు సంవత్సరాల పాటు వీళ్ళు ప్రేమలో ఉండి 2015 లో వివాహం చేసుకున్నారు.

4. జహీర్ ఖాన్, సాగరిక:

Ads

జహీర్ ఖాన్ కూడా నటి ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు 9 నెలల వరకు డేటింగ్ చేసుకున్నారు.
2017లో వీళ్ళు ఏడడుగులు వేశారు.

5. యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్:

యువరాజ్ సింగ్ కెరీర్ బాగున్నప్పుడే కాన్సర్ వచ్చింది. అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చాక
హేజెల్ తో పరిచయం ఏర్పడింది. 2016లో పెళ్లి జరిగింది.

6. మొహసీన్, రీనా:

క్రికెటర్ మొహసీన్ ఖాన్, బాలీవుడ్ నటి రీనా రాయ్ ప్రేమించుకున్నారు. తరవాత ఒకటి అయ్యారు. కానీ కొన్నాళ్ళకి విడాకులు తీసుకున్నారు.

7. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిక్:

నటాషా పాండ్య వలనే మరెంత పాపులర్ అయ్యింది. వీళ్ళు పెళ్లి చేసుకోక పోయినా నిశ్చితార్థం చేసుకున్నారు. అలానే ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు కూడా.

8. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ:

ఈ జంట గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. క్రికెట్ లో గుర్తింపు తెచ్చుకున్నాక బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ ని లవ్ చేసాడు విరాట్. నాలుగేళ్ళ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. ఒక బిడ్డకి జన్మనిచ్చారు కూడా.

 

Previous article”కొండారెడ్డి బురుజు” కి ఆ పేరు రావడం వెనుక.. ఇంత పెద్ద కథ ఉందా…?
Next articleక్రికెట్ కంటే ఫుట్ బాల్ ఏ ఎందుకు అంత పాపులర్ అయ్యింది.. కారణం ఇదే..!