82 ఏళ్ల వయసులో జిమ్‏లో సుమ తల్లి వర్కౌట్స్… యాంకర్ సుమ రియాక్షన్ ఇదే.!

Ads

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె యాక్టివ్ నెస్ ని చూస్తే చలాకితనం కూడా చిన్నబోతుంది. ఆమెకు అసలు అలసట అనేదే ఉండదా అంటూ చాలామంది ఆశ్చర్యపోతారు కూడా. అయితే ఒక 82 ఏళ్ల వృద్ధురాలు ఆమె కన్నా యాక్టివ్ గా ఉంటూ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆమె ఎవరో అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదు సుమ తల్లి. స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలని, ప్రొఫెషనల్ విషయాలని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అలాగే ఎన్నో రకాల రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెట్టి సందడి చేస్తూ ఉంటారు సుమ. అలాగే ఈ మధ్య ఆమె తల్లి వర్కౌట్ చేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సుమ. ఆ వీడియోలో త్రెడ్ మిల్ పై వర్కౌట్స్ చేస్తున్న సుమ తల్లిని పరిచయం చేస్తూ ఈమెకి 82 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతిరోజు ఇలాగే జిమ్ లో కష్టపడుతూ ఉంటారు అంటూ తల్లిని గురించి చెప్పుకొచ్చింది.

ఈ వీడియోలో సుమ తల్లిని చూస్తే అసలు ఆమెకు 82 సంవత్సరాల వయసు అంటే ఎవరు నమ్మరు, అంత చలాకీగా కనిపిస్తున్నారు ఆమె.ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన వాళ్లు సుమ ఇంత యాక్టివ్ గా ఎందుకు ఉంటారో మాకు ఇప్పుడు అర్థమైంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, జీన్స్ ఎక్కడికి పోతాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleఐదేళ్లలో 18 ఫ్లాప్ లు మూట కట్టుకున్న హీరోయిన్.. ఇంత డిజాస్టర్ కెరియర్ గ్రాఫ్ ఎవరిదంటే.?
Next articleఅజిత్ చేతిలో ఉన్న పాప ఆ చిన్నారా..? ఇంతలా మారిపోయిందేంటి?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.