Ads
మలయాళం సినిమాలు అంటే కంటెంట్ కి పెట్టింది పేరు అంటారు. వాళ్ళ దగ్గర ప్రతి సినిమాలో బలమైన కంటెంట్ ఉండదు. కానీ టేకింగ్ బాగుంటుంది. అన్ని సినిమాలు ఇలాగే ఉంటాయి అని కాదు. కొన్ని సింపుల్ గా ఉన్న కాన్సెప్ట్ లని కూడా చాలా బాగా చూపిస్తారు. తర్వాత ఏమవుతుందో అర్థం కాని స్టోరీ పాయింట్స్ ఉండవు. తెలిసిన కథే ఉంటుంది. కానీ, ఆ తెలిసిన కథని చాలా బాగా చూపిస్తారు. ఈమధ్య తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఇలా సింపుల్ కాన్సెప్ట్ మీద వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మలయాళంలో కొన్ని సినిమాల ద్వారా మలయాళ సినిమా అంటే తెలుగు వారికి ఇష్టం ఏర్పడింది.
అప్పటి నుండి మలయాళం సినిమాలు ఎక్కువగా చూడటం మొదలు పెట్టారు. అలాంటి సినిమాల్లో ముందు వరుసలో ఉండే సినిమా ఇది. ఈ సినిమా పేరు ఓం శాంతి ఓషానా. అంటే సుందరానికి సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నజ్రియా నజీమ్, నివిన్ పౌలీ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ తెలుగు వారికి తెలియడానికి కూడా ఈ సినిమా ఒక ముఖ్యమైన సినిమాగా నిలుస్తుంది. వీరికి ఈ సినిమా ద్వారానే తెలుగులో చాలా మంది అభిమానులు పెరిగారు. పూజ (నజ్రియా నజీమ్) అనే ఒక అమ్మాయి స్కూల్ లో చదువుకునేటప్పటినుండి తన ఇంటి దగ్గరే ఉంటున్న గిరి (నివిన్ పౌలీ) అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది.
Ads
గిరి పూజ కంటే చాలా పెద్దవాడు. అయినా కూడా పూజ అతనిని ఇష్టపడుతుంది. తర్వాత కాలేజ్ కి వస్తుంది. ఒకసారి గిరిని ప్రపోజ్ చేస్తుంది. కానీ గిరి, పూజ ప్రేమని అంగీకరించడు. ఆ తర్వాత పూజ మెడిసిన్ చదువుకోడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒకరోజు గిరి పూజా చదువుకుంటున్న చోటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆల్విన్ ఆంటోనీ, ఆల్విన్ ఆంటోనీ అనే ఇద్దరు ఈ సినిమాని నిర్మించారు. షాన్ రెహమాన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.
నజ్రియా నజీమ్ ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యాయి. పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా 2014 లో వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. కేవలం మలయాళం భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. కానీ చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి మెచ్చుకున్నారు. మలయాళ సినిమాకి అభిమానులు అయిపోయారు.
ALSO READ :