జెర్సీ నెంబర్ వెనకున్న ఈ రూల్స్ తెలుసా.? రోహిత్, కోహ్లీలకు ఆ నంబర్లు ఎలా వచ్చాయంటే.?

Ads

భారత్ లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్, ఆదరణ మరే క్రీడకు లేదని చెప్పవచ్చు. క్రికెట్ జాతీయ క్రీడ కానప్పటికీ  క్రికెట్‌కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. క్రికెట్ ను అభిమానించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చిన్నపిల్లల దగ్గర నుండి వయసు పైబడిన వారి వరకు చాలా ఆసక్తిగా చూస్తుంటారు.

Ads

క్రికెట్ మ్యాచ్‌ ఆడే సమయంలో ఆటగాళ్లు ర‌క‌ర‌కాల జెర్సీల‌ను వేసుకుంటారు. అయితే ఆ జెర్సీల వెనుక పెద్దగా, కనిపించేలా నంబ‌ర్లు ఉంటాయి. స‌చిన్ టెండుల్క‌ర్ క్రికెట్ ఆడేటప్పుడు స‌చిన్ జెర్సీ వెనుక ఎప్పుడూ 10 నంబ‌ర్ ఉండేది. అయితే ఆటగాళ్లకు ఆ నంబర్లను ఎలా కేటాయిస్తారు ? ఆ నంబర్ల  వెనక ఉన్న రూల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
క్రికెటర్లు ధరించే జెర్సీ లేదా టీ-షర్ట్ వెనుక ఉండే నంబర్ ను నిర్ణయించడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాత్ర ఉండదు. ఇండియాతో సహా క్రికెట్ ఆడుతున్న దేశాల క్రికెటర్లు వారు ధరించే జెర్సీ లేదా టీ-షర్టు నంబర్ ను వారే సెలెక్ట్ చేసుకుంటారు. విరాట్ కోహ్లీ ధరించే జెర్సీ నంబర్ 18, రోహిత్ శర్మ ధరించే జెర్సీ వెనుక ఉండే నంబర్ 45, కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ ధరించే జెర్సీ నంబర్ 7. ఇలా జెర్సీల వెనుక ఉండే నంబర్లను ఆ క్రికెటర్లు మాత్రమే ఎంచుకుంటారు.
అది వారి ఇంటిపేరు కావచ్చు, వారి పుట్టినరోజు లేదా అదృష్ట సంఖ్య కూడా కావచ్చు. వారి నమ్మకాలను బట్టి వాటిని ఎంచుకుంటారు. అయితే ఒకే జట్టుకు ఆడే ఆటగాళ్ల జెర్సీల నంబర్ మాత్రం ఒకటే ఉండకూడదు. ఈ నంబర్లు పెద్ద బోల్డ్ ఫాంట్‌లలో ఉండటం వల్ల కామెంటర్లకి, టివి, రేడియో వ్యాఖ్యాతలకు ఆటగాళ్లను  గుర్తుపట్టడం తేలిక అవుతుంది. అవుట్‌ఫీల్డ్‌లో ప్లేయర్ ని త్వరగా మరియు ఖచ్చితంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఒక ప్లేయర్ అద్భుతమైన క్యాచ్ పట్టినప్పుడు లేదా రన్-అవుట్‌ అయినపుడు, రెప్పపాటులో, వారి నంబర్ ను గుర్తు పట్టి వారిని వేరు చేయడం సులభం అవుతుంది.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ జెర్సీ వెనుక ఉన్న నంబర్ 18, ఆ నంబర్ ను అదృష్టంగా భావిస్తానని ఒక  ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తండ్రి 2006లో డిసెంబర్ 18న చనిపోయాడని, 18 జెర్సీ ధరించినపుడు  తన తండ్రి తనతో ఉన్నట్లు భావిస్తానని వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ జెర్సీ వెనుక ఉండే నంబర్ 45. ఈ నెంబర్ ను రోహిత్ తల్లి సెలెక్ట్ చేసింది. రోహిత్ లక్కీ నంబర్ 9, కానీ ఆ నంబర్ జట్టులోని పార్థివ్ పటేల్‌కు ఉంది. దాంతో తల్లి సూచన పై (4 + 5 = 9) తన జెర్సీ 45 ఎంచుకున్నాడు.

 

 

 

 

Previous articleఒక అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే… ఆ అబ్బాయి రిజెక్ట్ చేస్తే..? ఈ లవ్ స్టోరీ చూశారా..?
Next articleచదువుకోడానికి వెళ్తే అడుక్కోవడానికి వచ్చారు అనుకునేవాళ్లు..! ఈ పోలీస్ ఆఫీసర్ జీవితం ఎందరికో ఆదర్శం..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.