Ads
ఈ మధ్యకాలంలో చాలా మంది గుండెపోటు కారణంగా మరణించడాన్ని మనం చూసాము. సోషల్ మీడియాలో చాలా వార్తలు మీరు కూడా వినే ఉంటారు. గతంలో వచ్చిన ఒక వీడియోని చూస్తే అప్పటి వరకు బాగానే ఉండి డాన్స్ చేస్తున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా నేల మీద కుప్పకూలి పోయారు. ఇంకో వార్త గురించి చూస్తే.. చేతిలో పూలు పట్టుకుని కనబడుతున్న పెళ్ళికూతురు సడన్ గా గుండెపోటుతో చనిపోయారు.
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా గుండెపోటు కారణంగా మరణించిన విషయం తెలిసిందే. జిమ్ లో వ్యాయామం చేస్తూ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయారు.
ఇలా ఈ కాలంలో ఎక్కడ చూసినా గుండె పోట్లు ఎక్కువ వస్తున్నయికి. కనుక గుండెపోటు లక్షణాలు, గుండెపోటు సమస్య ఎందుకు వస్తుంది మొదలైన విషయాలని తప్పక తెలుసుకోండి. అలానే గుండెపోటు వచ్చిన అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది అనేది కూడా తప్పక తెలుసుకోండి.
అసలు ఎలా గుండె పోటు మొదలవుతుంది..?
Ads
గుండె పోటు రావడానికి అరగంట లేదా దాని కంటే ముందు ఛాతీలో నొప్పి వస్తుంది. అలానే చాలా మందికి ఎడమ చేతి లో కూడా నొప్పి వస్తుంది. తరవాత చెమటలు పడతాయి. తరవాత గుండె పోటు వచ్చే ప్రమాదం వుంది. ఇలా గుండె పోటు వచ్చి ఆసుపత్రికి వెళ్లినా బతికే అవకాశం చాలా తక్కువ. ఇలా ఆసుపత్రి లో చేరిన వారిలో 3 నుంచి 8 శాతం మంది మంది మాత్రమే బతికి బయటపడ్డారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
లక్షణాలు:
కడుపులో నొప్పి రావడం
ఛాతిపై ఒత్తిడి కలగడం
గొంతులో ఇరుకున్నట్టు ఇబ్బంది రావడం
కడుపులో గ్యాస్ అసిడిటీగా ఉండడం
పొత్తి కడుపు ఉబ్బినట్లుగా ఫీలింగ్ ఉండడం
బాగా అలసటగా ఉండడం
గుండె నుంచి వెన్ను కి నొప్పి కదిలినట్టుగా ఉండడం
పురుషులకే ఎక్కువ:
గుండె పోటు ఎక్కువగా పురుషుల్లో వస్తుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు ఎక్కువుంటాయి. కానీ మహిళల్లో రుతుచక్రం గుండె పోటు రిస్క్ తగ్గిస్తుంది. రుతుచక్రం సమయంలో రక్తంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈస్ట్రెజెన్ స్థాయిలు తగ్గితే మహిళలకి మెనోపాజ్ వస్తుంది. అలాంటప్పుడు గుండె పోటు రిస్క్ ఎక్కువ అవుతుంది.