పుష్ప 2 లో ఐటెం సాంగ్ కి ఆమె మాత్రం వద్దు అంటున్న బన్నీ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Ads

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మండన్న జంటగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో సుకుమార్ దర్శకత్వంతో విడుదలైన చిత్రం పుష్ప పార్ట్ 1. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే ఈ సినిమా విడుదలైన తర్వాత భారతదేశం మొత్తం అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ని సంపాదించుకుంది ఈ సినిమా.

ఇప్పుడు భారతదేశమంతా పుష్ప2 ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.పుష్ప టు షూటింగ్ కూడా వేగవంతంగా అవుతుంది అని చిత్రం బృందం చెప్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టరు తెగ వైరల్ అయిపోయి ఎక్కడా లేని క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రష్మిక మండన్న, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి ప్రముఖులు నటిస్తున్నారు.

Ads

పుష్ప 1లో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ తనకు నేషనల్ అవార్డుని కూడా తెచ్చి పెట్టింది. సమంత స్పెషల్ సాంగ్లో నటించిన ఊ అంటావా మావా పాట ఎంత క్రేజ్ ని ఇచ్చిందో చెప్పాల్సిన లేదు. అయితే పుష్ప 2 లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది.కానీ అందులో ఎవరు నటిస్తున్నారో అనేదానికి ఇప్పటికీ ఏ క్లారిటీ రాలేదు. ముందు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చాలా హీరోయిన్ల పేర్లు వినబడ్డాయి కానీ ఇప్పుడు అన్ని రూమర్స్ అనే తెలిసాయి.

మేకర్స్ మళ్లీ సమంత దగ్గరికే వెళ్లి ఐటెం సాంగ్ కోసం అడిగారని వార్తలు వస్తున్నాయి కానీ ఇవి కూడా రూమర్స్ అని తేల్చి చెప్పేశారు.గతంలో ఊర్వశి రౌటెలని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కి అడిగారట కానీ బన్నీ ఫాన్స్ ఆమె మాత్రం వద్దు రా బాబు అని అంటున్నారు. ఎందుకంటే ఊర్వశి తెలుగులో నటించిన ఏ ఒక్క చిత్రం కూడా హిట్ కాలేదు. స్కంద, వాల్తేర్ వీరయ్య,బ్రో, ఏజెంట్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. అందుకే ఈమె మాత్రం వద్దు రా బాబు అని భయపడుతున్నారు బన్నీ ఫ్యాన్స్.

Previous articleగుండె పోటు రావడానికి అరగంట ముందు ఏం అవుతుందో తెలుసా..?
Next articleఘరానా మొగుడు – ఛత్రపతి సినిమాల్లో ఈ రెండు సీన్లు గమనించారా.? భలే మోసం చేసారుగా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.