Ads
నారా లోకేష్ ఇటీవల మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న హఠాత్తుగా కుప్పకూలడంతో అందరు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. వెంటనే ఆయనను టీడీపీ నాయకులు, అభిమానులు దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ కి తరలించారు.
Ads
నారాయణ హృదయాలయలో వారం రోజుల నుండి చికిత్స కొనసాగుతున్నప్పటికి తారకరత్న ఇప్పటివరకు కూడా స్పృహలోకి రాకపోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన పడుతున్నారు. ఇక తారకరత్న హెల్త్ కండిషన్ పై ఆందోళన కొనసాగుతుంది. అయితే వైద్యులు, కుటుంబ సభ్యులు మాత్రం ఆయన హెల్త్ కండిషన్ మెరుగుపడుతోందని, ట్రీట్మెంట్ కు తారకరత్న స్పందిస్తున్నాడని అంటున్నారు.
డాక్టర్లు తారకరత్నకు పెద్ద ప్రమాదం తప్పిందని తెలపడంతో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ నెమ్మది పడుతున్నారు. ఇక అందరు ఆయన పూర్తి ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నారు. మరో వైపు సామాజిక మధ్యమాలలో తారకరత్నకు అయిన వైద్య ఖర్చుల గురించి రక రకాల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయం మీద చర్చలు జరుపుతున్నారు. తారకరత్న ట్రీట్మెంట్ కి లక్షల్లో ఖర్చు అయ్యిందని, మెరుగైన ట్రీట్మెంట్ అందించడం కోసం ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా ఆసుపత్రి ఖర్చులు అయినట్టుగా వినిపిస్తోంది.
కాగా, తారకరత్న ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులను నారా లోకేష్ పెడుతున్నట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విషయంలో నారా లోకేష్ మాత్రమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు కూడా నందమూరి ఫ్యామిలికి ఆర్థికంగా అండగా ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తారకరత్న పూర్తి ఆరోగ్యంగా వచ్చే దాకా ఎంత ఖర్చు అయినా తమదే బాధ్యత అని మాట ఇచ్చినట్లుగా సమాచారం.
ఇక తారకరత్నకు చికిత్స చేస్తున్న నారాయణ హృదయాలయ ఆస్పత్రిలోనే తండ్రి మోహనకృష్ణ, ఆయన వైఫ్ అలేఖ్యా రెడ్డితో పాటుగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, కళ్యాణ్ రామ్ బెంగళూరు ఆసుపత్రికి వెళ్ళి తారకరత్న ఆరోగ్య హెల్త్ కండిషన్ గురించి తెలుసుకున్నారు. బాలయ్య, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు.
Also Read: హాస్పటల్ లో ఉన్న ‘తారకరత్న’ భార్య అలేఖ్య రెడ్డికి సహాయంగా ఉన్న ఈ వ్యక్తి గురించి తెలుసా?