హాస్పటల్ లో ఉన్న ‘తారకరత్న’ భార్య అలేఖ్య రెడ్డికి సహాయంగా ఉన్న ఈ వ్యక్తి గురించి తెలుసా?

Ads

నందమూరి తారకరత్నకు గుండె పోటు వచ్చి, హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గత వారం రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు బాలకృష్ణ, భార్య, కూతురు అక్కడే ఉంటున్నారు.

Ads

తారకరత్నను చూసేందుకు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఆసుపత్రికి వెళ్ళి, ఆయనను చూసి వస్తున్నారు. ఆయన బాబాయి బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్నను చూసుకుంటున్నాడు. ఇక తారకరత్న కుటుంబానికి నందమూరి కుటుంబం అండగా ఉంది. బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో నందమూరి ఫ్యామిలీతో పాటుగా టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, టిడిపి ఇన్చార్జ్ అయిన చల్లా రామచంద్రారెడ్డి అక్కడే ఉన్నారు. ఆయనకి తారకరత్నతో పార్టీ పరంగానే కాకుండా బంధుత్వం కూడా ఉందని తెలుస్తోంది.
చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కూతురే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి. 2012 ఆగస్టు 2న తారకరత్న అలేఖ్యరెడ్డిని సంగీ టెంపుల్ లో అతి కొద్దిమంది బంధుమిత్రుల మధ్యలో వివాహం చేసుకున్నారు. వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తారకరత్న తండ్రితో పాటుగా నందమూరి ఫ్యామిలీ వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో, టెంపుల్ లో పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు. అలేఖ్య రెడ్డి, చల్లా రామచంద్రరెడ్డికి పెద్దమ్మ కూతురు అవడంతో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసి ఇటు నందమూరి ఫ్యామిలీతో పాటు చల్లా కుటుంబం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యింది.
ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. ఆయన కోలుకోవాలని టీడీపీ నేతలు, ఫ్యాన్స్ పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. ఆయనకు గుండెపోటు వచ్చిన సమయంలో 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల బ్రెయిన్‌ ఎఫ్ఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా తారకరత్న వెంటిలేటర్‌ పైనే ఉన్నారు. ఆయనకు ICUలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది.

Also Read: ఎన్టీఆర్ రక్తం కారుతున్నప్పటికి, మిరపకాయలు ఎందుకు నమిలాడో తెలుసా?

Previous articleబాహుబలి చిత్రంలో ఈ సీన్ ని ఎప్పుడైనా గమనించారా?
Next articleబాలయ్య ‘అఖండ’ సినిమాలో న‌టించిన ఈ నటి గురించి తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.