Ads
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. క్రితం సారి జరిగిన ఆసియా కప్ లో భారత్ ఫైనల్స్ కి కూడా వెళ్లకుండానే ఇంటిదారి పట్టింది.
ఈ నేపథ్యంలో టీమిండియాకు జరగబోయే మ్యాచ్ ఎంతో కీలకం గా మారింది. ఆసియా కప్ ప్రారంభం కావడానికి గట్టిగా వారం రోజులు సమయం కూడా లేదు. పైగా వన్డే ప్రపంచ కప్ జరగడానికి ముందు ఈ టోర్నమెంట్ జరుగుతోంది కాబట్టి ఇది ఇంకా క్రేజ్ సంతరించుకుంది.
అయితే ఇక్కడ ముఖ్యంగా ఆసియా కప్పు గెలవాలి అంటే భారత్ తనను వెంటాడుతున్న సమస్యలకు చెక్ పెట్టక తప్పదు. ఆసియా కప్ అయిన తర్వాత ప్రపంచ కప్ కూడా ఉంటుంది.. కాబట్టి టీమిండియా ముందు తన టీమ్ లో ఉన్న లోకాలను సమస్యలను పరిష్కరించాలి. మరి ఆ సమస్యలేంటో ఒక లుక్ వేద్దామా..ప్రస్తుతం టీమిండియా ముందు ఉన్న ఒక పెద్ద సవాలు ఓపెనింగ్ సమస్య.
Ads
ఐపీఎల్ 2023 మ్యాచ్ తర్వాత భారత్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ఫామ్ కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తుంది. కేవలం ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే ఆడుతూ బౌలింగ్ అనుకూలించే పిచ్ లపై పరుగులు చేయడానికి తట పటాయిస్తూ ఉన్నాడు.మరోపక్క టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ పర్ఫామెన్స్ ప్రతి మ్యాచ్ లో తగ్గుతూనే ఉంది. టాప్ త్రీ ప్లేయర్స్ ఆడితేనే మ్యాచ్ గెలిచే ఆస్కారం ఉంది తప్ప వాళ్ళలో ఏ ఒక్కరు చేతులెత్తేసిన ఇక మిడిల్ ఆర్డర్ మొత్తం సింగిల్ స్కోర్లతో పెవిలియన్ దారి పడుతుంది. ఆసియా కప్ గెలవాలి అంటే కచ్చితంగా మిడిల్ ఆర్డర్ ను పటిష్టం చేసుకోవాలి.
మరొక ముఖ్యమైన సమస్య బౌలింగ్…అపోనెంట్ బ్యాట్స్మెన్ సరిగ్గా కట్టడి చేయలేకపోతే కొన్నిసార్లు మ్యాచ్ కష్టంగా మారుతుంది. గత కొద్దికాలంగా టీమిండియా బౌలర్ల పరిస్థితి నిలకడగా లేదు. ఒక మ్యాచ్ లో అదరగొడితే మరొక మ్యాచ్ లో సులభంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ఈ సమస్యలన్నిటినీ టీమిండియా పరిష్కరించుకుంటేనే ఆసియా కప్ పైన ప్రపంచకప్ అయిన.. మరి ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ మరియు కెప్టెన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి.
ALSO READ : స్టార్ హీరోలతో సినిమాలు…సినిమా సూపర్ హిట్..!! కానీ ఈ హీరోయిన్ల కెరీర్ మాత్రం ఫ్లాపేనా.?