స్టార్ హీరోలతో సినిమాలు…సినిమా సూపర్ హిట్..!! కానీ ఈ హీరోయిన్ల కెరీర్ మాత్రం ఫ్లాపేనా.?

Ads

మామూలుగా నటించిన చిత్రం హిట్ అయితే కచ్చితంగా ఆ హీరోయిన్ కి ఆఫర్స్ రావడమే కాకుండా మంచి క్రేజ్ కూడా ఏర్పడుతుంది. కానీ సినీ ఇండస్ట్రీలో అనీ అనుకున్నట్లే జరగవు.. కొన్నిసార్లు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అయినప్పటికీ అందరూ నటించిన హీరోయిన్లు మాత్రం అడ్రస్ లేకుండా పోతారు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ గా కొందరు హీరోయిన్లు చరిత్రలో మిగిలిపోయారు. వాళ్లు నటించిన చిత్రాలు కేవలం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియన్ రేంజ్ లో సక్సెస్ సాధించిన వాళ్ళ కెరియర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మిగిలిపోయింది. మరి ఆ హీరోయిన్లు ఎవరో ఒక లుక్ వేద్దామా..

సినీ ఇండస్ట్రీలో కేజిఎఫ్ మూవీ క్రియేట్ చేసిన ప్రకంపనలు ఎటువంటివో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో నటించిన హీరో యష్ మాత్రం ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు. కానీ పాపం హీరోయిన్ శ్రీనిధి శెట్టి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.కేజీయఫ్‌ రెండు పార్ట్స్ లో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి పర్ఫామెన్స్ స్కూల్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తో పోగ్రాలో నటించిన ఆ మూవీలో పెద్దగా క్లిక్ కాలేదు.

Ads

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కంచె మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. క్యూట్ గా చూడ చక్కగా ఉండే ఈ భామ లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి అఖండతో భారీ విజయాన్ని అందుకుంది. అఖండ హిట్ తో బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ అఖండంగా మొదలైనా.. పాపం ప్రగ్యా మాత్రం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదు.

భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా మీనన్ .. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీలో నటించింది. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో పాటు ఈ బ్యూటీకి ధనుష్ సార్ మూవీలో ఆఫర్ వచ్చింది. ఆమె ముచ్చటగా నటించిన మూడవ చిత్రం విరూపాక్ష కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హ్యాట్రిక్ హిట్స్ సాధించినా…చాలా గ్యాప్ తర్వాత ఇప్పటికీ స్వయంభులో తిరిగి ఆఫర్ అందుకుంది సంయుక్తా.

Previous articleవిక్రమార్కుడు లో రవితేజ కూతురు ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఎంత అందంగా ఉందో చూడండి.!
Next articleబట్టతల మగవారికి మాత్రమే ఎందుకు వస్తుంది.? ఆడవాళ్ళకి రాకపోవడానికి కారణం ఇదే.!