ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Ads

సినిమా ఇండస్ట్రీలో కొందరు తారలు ఆకాశంలో చుక్కల్లా కొంతకాలం మెరిసి ఆ తర్వాత కనుమరుగైపోతుంటారు. అలాంటి వారిలో కొందరు సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుంటారు.

మరి కొంతమంది సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా అని అభిమానులతో కాస్త టచ్ లో ఉంటారు. మరి కొంతమంది ఫోటోలు ఎప్పుడో సోషల్ మీడియాలో అలా తలుక్కుని మెరిసినప్పుడు ఫలానా స్టార్ ఇలా ఉన్నాడే అని అభిమానులు షాక్ అవుతారు.

can you recognize this actor

ఇదే టైపులో ప్రస్తుతం ఒక హీరోయిన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలు నటించడమే కాకుండా, ఐటమ్ సాంగ్స్ లో కూడా ఇరగదీసింది. తెలుగులోనే కాకుండా ఆమె హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఖత్రోన్‌ కె ఖిలాడీ అనే రియాల్టీ షో నాలుగవ సీజన్లో విజేతగా నిలిచింది.

can you recognize this actor

Ads

ఆమె మరెవరో కాదు అందమైన అరేబియన్ గుర్రంలా ఉండే ఆర్తి చాబ్రియా. కేవలం మూడు సంవత్సరాల వయసులోనే మోడల్ గా మారిన ఈ బ్యూటీ.. మ్యాగీ ,పెప్సోడెంట్, అమూల్ ఇలా ఎన్నో రకాల ప్రమోషనల్ యాడ్స్ లో నటించింది. ఒకటి రెండు కాదండోయ్ ఏకంగా 300 యాడ్స్ లో ఆర్తి నటించింది. యాడ్స్ ద్వారా మంచి గుర్తింపు రావడంతో మెల్లిగా బాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే రేంజ్కి ఎదిగింది.

can you recognize this actor

అంతే అనుకుంటున్నారా 1999లో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. మంచి మోడల్ గా గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు పలు రకాల మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. 2002లో తుమ్‌సే అచ్చా కౌన్‌ హౌ అనే మూవీ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత మధుర క్షణం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టింది. ఇక ఆ తరువాత వరుసగా తెలుగు చిత్రాల్లో నటించిన ఈ భామ చింతకాయల రవి మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

can you recognize this actor

యాక్టింగ్ తో ఆగిపోకుండా దర్శక నిర్మాతగా ముంబై వారణాసి ఎక్స్ప్రెస్ అనే ఒక చిన్ని లఘు చిత్రాన్ని తెరకెక్కించి ఎన్నో అవార్డులు కూడా దక్కించుకుంది ఆర్తి. ఇలా సినీ ఇండస్ట్రీలో ఆల్రౌండర్ గా మెలిగిన ఆర్తి 2013లో వ్యాహ్‌ 70 కి.మీ అనే సినిమా తరువాత మరింకే చిత్రంలో నటించలేదు. పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం సినిమాలకు చాలా దూరంగా ఉంది.

Previous article“ఆసియా కప్” కి ముందు టీం ఇండియా సరి చేసుకోవాల్సిన విషయాలు ఇవేనా..?
Next articleఆసియా కప్ కు దూరం చేయడంతో …వేరే దేశం తరఫున ఆడనున్న ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా.?