Ads
2022వ సంవత్సరం చివరి దశకి వచ్చింది. ఇంకో రెండు వారాలలో 2022 పూర్తయిపోతుంది. కొత్త ఆశలతో న్యూ ఇయర్ లోకి ప్రవేశించబోతోంది. టాలీవుడ్. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలకి పైగా ఎన్నో ఇబ్బందులు పడింది. తెలుగు సినీ పరిశ్రమ.
లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో విడుదలైన బాలకృష్ణ అఖండ, అల్లు అర్జున్ పుష్ప చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీకి ఉత్సాహాన్నిచ్చాయి. ఇక ఈ సంవత్సరం ఆర్ఆర్ఆర్, ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా, వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా అంటే ఏమిటో చూపించింది. విక్రమ్, కెజీఎఫ్ 2, కాంతార వంటి డబ్బింగ్ సినిమాలు కూడా సంచలనం క్రియేట్ చేసి కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.ఇక తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ లోను సత్తా చాటాయి. తెలుగు సినిమాలు రాబట్టిన కలెక్షన్లు నార్త్ ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేశాయి. గత సంవత్సరం ‘పుష్ప’ పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ సృష్టించడం అందరికి సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కూడా రికార్డ్ సృష్టించింది. దాంతో బాలీవుడ్ వాళ్లు చాలా కంగారు పడ్డారనే చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరం బాలీవుడ్ మూవీ కలెక్షన్స్ ఏది కూడా ‘పుష్ప’దరిదాపుల్లోకి కూడా రాలేదు.
అయితే ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ కి భారీ షాక్ నే ఇచ్చింది. నార్త్ ఆడియెన్స్ కూడా తెలుగు చిత్రాలను బాగా ఆదరించారు. ఇక 2022లో బాలీవుడ్ మార్కెట్‌లోసత్తా చాటిన తెలుగు డబ్బింగ్ మూవీస్, అవి రాబట్టిన వసూళ్ల వివరాలు చూద్దాం..
Ads
#1. రాధే శ్యామ్: రూ. 22.25 కోట్ల వసూళ్లను రాబట్టింది.
#2. మేజర్: రూ. 13 కోట్ల వసూళ్లను సాధించింది.
#3. ఆర్ఆర్ఆర్: రూ. 277 కోట్ల వసూళ్లను సాధించింది. #4. కార్తికేయ 2: రూ. 34 కోట్ల వసూళ్లను సాధించింది.
#5. లైగర్: రూ. 21.2 కోట్ల వసూళ్లను సాధించింది.
#6. సీతా రామం: రూ. 8.6 కోట్ల వసూళ్లను సాధించింది.
#7. గాడ్ ఫాదర్: రూ. 10 కోట్ల వసూళ్లను సాధించింది.
Also Read:టాలీవుడ్ లో నిరాశ పరిచిన ‘ సీక్వెల్ ‘ సినిమాలు..!