Ads
సినిమాలలో కథకి అనుగుణంగా ద్విపాత్రాభినయం చేయడం అనేది సాధారణ విషయమే. కానీ మూడు పాత్రలు లేదా అంతకంటే ఎక్కవ క్యారెక్టర్స్ ఒకే యాక్టర్ చేయడం అనేది ఆషామాషీ కాదు. అలా చేయడానికి చాలా పట్టుదల, కృషి ఉండాలి.
Ads
తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి ప్రయోగాలు తొలి తరం యాక్టర్స్ ప్రారంభించారు. ఎన్నో సినిమాలలో త్రిపాత్రాభినయం చేసి ఆడియెన్స్ ని అలరించారు. సీనియర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి నందమూరి కళ్యాణ్ రామ్ వరకు త్రిపాత్రాభినయం చేసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
1.నటరత్న ఎన్టీరామారావు:
ఎన్టీ రామారావు కుల గౌరవం, దాన వీర శూరకర్ణ, శ్రీ కృష్ణ సత్య, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర లాంటి సినిమాలలో మూడు, అంతకంటే ఎక్కువ పాత్రలలో నటించి అలరించారు.
2.నటసామ్రాట్ ఏఎన్నార్:
అక్కినేని నాగేశ్వర రావు నవరాత్రి అనే సినిమాలో 9 పాత్రలు చేయడం విశేషం. అది కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి అలరించారు.
3.సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ కుమార రాజా, రక్తసంబంధం, పగబట్టిన సింహం, డాక్టర్ సినీ యాక్టర్, బంగారు కాపురం, సిరిపురం మొనగాడు, బొబ్బిలి దొర లాంటి 7 సినిమాలలో త్రిపాత్రాభినయం చేసి అలరించారు.
4.నటభూషణ శోభన్ బాబు:
శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు.
5.మెగాస్టార్ చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మూడు పాత్రలలో నటించారు. లారీ డ్రైవర్ గా, పోలీస్ ఆఫీసర్ గా, క్లాసికల్ డ్యాన్సర్ గా మూడు డిఫరెంట్ పాత్రలలో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు.
6.నందమూరి నటసింహ బాలకృష్ణ:
నందమూరి బాలకృష్ణ అధినాయకుడు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో తాతగా, తండ్రిగా, మనవడిగా నటించి అలరించారు.
7.కింగ్ నాగార్జున:
కింగ్ నాగార్జున సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేయలేదు. అయితే ఆయన హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షో యాడ్ కోసం మూడు పాత్రల్లో ఒకేసారి కనిపించి అలరించారు.
8.యంగ్ టైగర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశాడు. ఈ చిత్రంలో రావణ్, దొంగ, బ్యాంక్ ఉద్యోగి అయిన అన్నదమ్ముళ్ళలగా నటించి అలరించాడు.
9.నందమూరి కళ్యాణ్ రామ్:
నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించి ఆకట్టుకున్నాడు.
Also Read: బాలనటుడుగా నటించిన రాజమౌళి.. ఆ సినిమా ఏమిటో తెలుసా?