మెట్రో ట్రైన్ ట్రాక్ పై కంకర రాళ్ళు ఎందుకు ఉండవు..?

Ads

మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత చాలా మందికి సౌకర్యవంతంగా ఉంటోంది. వారి యొక్క గమ్యస్థానాన్ని సులువుగా మెట్రో ద్వారా చేరుకుంటున్నారు చాలా మంది. అయితే మామూలు ట్రైన్ కంటే కూడా మెట్రో ట్రైన్ లోచూస్తే చాలా మార్పులు మనకి కనపడుతూ ఉంటాయి. మామూలు ట్రైన్ లాగే మెట్రో ట్రైన్ మరియు ట్రాక్ వుండవు. రెండింటి మధ్యా కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయాన్ని తప్పక చెప్పుకోవాలి. మామూలు రైల్వే ట్రాక్ ని చూస్తే రైల్వే ట్రాక్ మీద కంకర రాళ్లు మనకి కనబడతాయి.

అదే మెట్రో ట్రైన్ యొక్క రైల్వే ట్రాక్ ని చూస్తే కంకర రాళ్లు ఉండవు. ఎందుకు మెట్రో ట్రైన్ కింద కంకర రాళ్లు వేయరు దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. మరి ఇప్పుడే చూసేయండి.. మెట్రో రైల్వే ట్రాక్లని అండర్ గ్రౌండ్ లో కానీ బాగా హైట్ లో కానీ పెడుతూ ఉంటారు. మెట్రో ట్రైన్ వల్ల వైబ్రేషన్స్ కలగకుండా ఉండేందుకు దృఢమైన కాంక్రీట్ ని ఉపయోగిస్తారు.

Ads

రాళ్ళని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. రాళ్లని మార్చడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ మెట్రో ట్రైన్స్ కి అయితే కింద దృఢమైన కాంక్రీట్ ని ఉపయోగించడం వలన మెయింటనెన్స్ చెయ్యక్కర్లేదు. కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా పర్మినెంట్ గా ఉంటాయి. మెట్రో ట్రైన్స్ ని ఏర్పాటు చేసేటప్పుడు అండర్ గ్రౌండ్ లో కానీ బాగా ఎత్తైన చోట్ల కానీ పెడతారు.

కాబట్టి రాళ్లని మార్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎత్తులో ఉండడం వలన వర్షం నీళ్ళు కూడా కిందకి వెళ్ళిపోతుంది మొక్కలు వంటివి కూడా పెరగవు. పైగా మెట్రో రైళ్లు తక్కువ దూరానికే ప్రయాణం చేస్తాయి. పైగా బాగా బరువుగా ఉండే వాటిని కూడా మెట్రో ట్రైన్స్ తీసుకు వెళ్ళక్కర్లేదు కాబట్టి ఈ విధంగా ట్రాక్స్ ని ఏర్పాటు చేస్తారు. రాళ్లు అవసరం లేదు.

Previous articleఈ 5 రాశుల వాళ్ళు.. ఎట్టిపరిస్థితుల్లో లవ్ చేసిన వాళ్ళని వదులుకోరు..!
Next articleసమంత తో పాటుగా.. ఈ 9 మంది హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో మీకు తెలుసా…?