Ads
సినీ పరిశ్రమలో హీరోయిన్స్ హీరోలతో పోల్చితే సుదీర్ఘకాలం ఉండలేరు. వారు పాతబడుతుంటే వారి స్థానంలోకి కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. కొత్తగా వచ్చిన హీరోయిన్స్ అంగీకరిస్తూ, సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారు ఆడియెన్స్.
ఇక హీరోయిన్ గా ఒకే సినిమాతో కూడా కనుమారుగయ్యే వారు వారిని చాలా తక్కువమంది ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలా వచ్చి, వెళ్ళిన హీరోయిన్ గురించే, 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్, ఆ సినిమా తర్వాత కనిపించకుండా పోయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. బాలీవుడ్ హీరోయిన్ అదితి గోవత్రికర్. ఆ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు.
Ads
ఇక తమ్ముడు మూవీలో ప్రీతీ జింగానీయా ‘జానూ’ పాత్రలో నటించింది. తాను కాకుండా లవ్ లీ అనే పాత్రలో అదితి గోవత్రికర్ నటించింది. ఆ లవ్ లీ క్యారెక్టర్ అప్పటి యువతకు గుర్తు ఉంటుంది. ఈ మూవీలో లవ్ లీ కోసం పవన్ కళ్యాణ్ పాడిన పాట ఇప్పటికీ వింటూనే ఉంటారు. అంతగా పాపులర్ అయ్యింది. సుబ్బు పాత్రలో పవన్ హే పిల్ల నీ పేరు లవ్ లీ పాట పాడుతూ, వెంట పడిన ఆ బ్యూటీ అదితి. ఆ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. అందరూ అదితిని మర్చిపోయి ఉంటారు. అయితే తమ్ముడు మూవీ అంటే మాత్రం పవన్ కళ్యాణ్, ప్రీతీ జింగానీయాలే కాదు, లవ్ లీ కూడా వెంటనే గుర్తుకు వస్తుంది.తెలుగులో అదితి గోవత్రికర్ చేసింది ఒకటే సినిమానే అయినా కూడా ఆమె ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అదితి మహారాష్ట్రలోని పన్వేల్ లో పుట్టి పెరిగింది. ఆమె చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. చాలా అందాల పోటీలలో టైటిల్స్ గెలిచి, టాలీవుడ్ లో ‘తమ్ముడు’ మూవీతోనే సినీ కెరీర్ మొదలు పెట్టింది. కానీ ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది.