Ads
పరమేశ్వరుడిని లయకారుడు అని అంటారు. భక్తుల కోరికలు తీర్చే బోలా శంకరుడిగా కీర్తిస్తారు. భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో శివుడిన కొలిచినట్లయితే ఎలాంటి వారిని అయినా అనుగ్రహిస్తారని మహాదేవున్ని స్తుతిస్తారు. పరమశివుడిని లింగ రూపంలో కొలుస్తారు.
Ads
ఆ పరమశివుడు అన్ని రకాలైన ఆడంబరాలకు దూరం అని భక్తుల విశ్వాసం. అందువల్ల శివారాధనలో బిళ్వ పత్రం, ఉమ్మెత్త, గంధపు ముద్ద, భస్మం, పచ్చి పాల లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా శివుని పూజలో పసుపు, సింధూరంను వాడకూడదట. ఒకవేళ శివారాధనలో పసుపును వాడినట్లయితే శివునికి ఆగ్రహం వస్తుంది. పూజ చేసిన ఫలం లభించదు. శివ పూజలో పసుపు, సింధురాలను ఎందుకు ఉపయోగించకూడదో ఇప్పుడు చూద్దాం..పరమశివుడు అభిషేక ప్రియుడు. అందువల్ల పరమేశ్వరుడిని నీటితో అభిషేహించి, పూజించిన కూడా ఆయన అనుగ్రహం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే మహాశివుడు అభిషేక ప్రియుడు అయినందువల్ల ఆయనకు వివిధ పదార్థాలతో అభిషేకాలు చేస్తుంటారు. అలాగే మహాదేవుడికి రక రకాల పువ్వులతో పూజలు నిర్వహిస్తుంటారు. అయితే పరమశివుడి పూజలో పసుపును, సింధూరంను పొరపాటున కూడా ఉపయోగించరు. చందనం ఉపయోగిస్తుంటారు.
శివుడిని పూజించేటప్పుడు పొరపాటున కూడా సింధూరం ఉపయోగించకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సింధూరంను మహిళల మాంగళ్యానికి చిహ్నంగా భావిస్తారు. పరమ శివుడిని లయకారుడు అని పిలుస్తారు. అందువల్ల శివుడి పూజలో సింధూరం సమర్పించరు. ఒకవేళ పూజలో వాడినట్లయితే శివుడికి ఆగ్రహం వస్తుంది. కాబట్టి శివుడికి సింధూరం సమర్పించకూడదనే విషయం గుర్తుంచుకోవాలి.
సనాతన ధర్మంలో చెప్పిన ప్రకారం పసుపును చాలా పవిత్రమైందిగా, స్వచ్ఛమైనడిగా పరిగణిస్తారు. కానీ పరమశివుడిని పసుపుతో మాత్రం పూజించరు. దానికి కారణం ఏమిటంటే శాస్త్రాల ప్రకారంగా శివలింగం పురుష తత్వానికి గుర్తు. పసుపు అనేది స్త్రీలకు సంబంధించినది కాబట్టి శివుడి పూజలో పసుపును ఉపయోగించరు. శివారధనలో పసుపును వాడినట్లయితే అది నిరుపయోగం అవుతుంది. అంతేకాకుండా పూజాఫలాన్ని పొందలేరు. కావున పొరపాటున కూడా శివలింగానికి పసుపును సమర్పించకూడదు.
Also Read: మహా శివరాత్రి పర్వదినాన చేయకూడని పనులు ఏమిటో తెలుసా?