ఇంట్లో ఎట్టిపరిస్థితుల్లో ఈ 5 తప్పులు చెయ్యద్దు.. సమస్యల్లో చిక్కుకుంటారు..!

Ads

చాలా మంది తరచూ వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతీ ఇంట్లో ఏదో ఒక సమస్య రావడం సహజమే. ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఇలా… ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. హిందూ సంప్రదాయాలని పూర్వం నుండి కూడా మనదేశంలో ఎక్కువగా పాటిస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా హిందువులు వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎటువంటి బాధలు అయినా సరే దూరమైపోతాయని పండితులు అంటూ ఉంటారు.

పైగా చాలా మంది అదే విషయాన్ని నమ్ముతారు. ఏ దిశ లో ఏ వస్తువు ఉండకూడదు ఎటువంటి వాటిని ఏ దిక్కులో ఉంచుకుంటే మంచిది అనేది చూసి చాలా మంది అనుసరిస్తారు అలా కనుక నడుచుకుంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందని వాస్తు పండితులు అంటున్నారు. పండితులు కొన్ని రకాల ఫోటోలని పెట్టకూడదని అంటున్నారు. మరి ఎటువంటి ఫోటోలని పెట్టకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే సరి చేసుకోండి.

Ads

  1. ఏదైనా నీటిలో మునిగిపోతున్నట్లు ఉండే ఫోటోని కనుక మీ ఇంట్లో పెడితే వెంటనే తొలగించండి. ఇలాంటి ఫోటో అశుభ ఫలితాలను తీసుకువస్తుంది. కాబట్టి మునిగిపోతున్న ఓడ వంటి ఫోటోలని ఉంచొద్దు.
  2. అలానే చాలామంది తాజ్ మహల్ చాలా అందంగా ఉంటుందని తాజ్ మహల్ ఫోటో ని కూడా ఇంట్లో పెడుతూ ఉంటారు కానీ తాజ్ మహల్ ని ఇంట్లో ఉంచడం వలన చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
  3. అలానే ప్రకృతికి సంబంధించిన ఫోటోలని కూడా చాలామంది పెడుతూ ఉంటారు ప్రకృతికి సంబంధించి పెద్ద పెద్ద ఫ్రేమ్ లని ఇంట్లో ఉంచుతారు. జలపాతాలని కూడా పెడుతూ ఉంటారు. నిజానికి జలపాతాలని అస్సలు పెట్టకూడదు. జలపాతాలకి సంబంధించిన ఫోటోలు కనుక ఇంట్లో ఉంటే తొలగించడం మంచిది. ఇలాంటి ఫోటోలుని ఇంట్లో పెట్టడం వలన డబ్బులు కూడా నీరులాగే ఖర్చు అయిపోతాయి.
  4. క్రూర జంతువులకు సంబంధించిన ఫోటోలను కూడా తీసేయండి. మీ ఇంట్లో గొడవలు పెరిగి హింసాత్మక పరిస్థితులుగా అవి మారే అవకాశం ఉంది.
  5. పురాణాల్లో యుద్ధానికి సంబంధించిన ఫోటోలు కూడా పెడుతూ ఉంటారు అటువంటి వాటిని కూడా పెట్టొద్దు.
Previous article”తొలిప్రేమ” మొదలు ”లవ్ టుడే” దాకా.. నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించిన 7 సినిమాలు ఇవే..!
Next articleపరమశివుడి పూజలో సింధూరం, పసుపు ఎందుకు ఉపయోగించరో తెలుసా?