Ads
ఒకప్పుడు రిఫ్రిజిరేటర్ అంటే విలాసవంతమైన వస్తువుగా చూసేవారు. కొందరి ఇళ్లలోనే కనిపించేవి. అయితే ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ అనేది నిత్యవసర వస్తువు అయ్యింది. వీరి ధరలు అందుబాటులో ఉండడం, ఈఎమ్ఐలో తీసుకునే అవకాశం ఉండడంతో ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది సాధారణ వస్తువుగా మారింది.
ఇక రిఫ్రిజిరేటర్ ను వాడే క్రమంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులలో డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ గడ్డకట్టడం ఒకటి. కొన్నిసార్లు ఆ బాక్సులో ఐస్ కొండలా పేరుకుపోతుంటుంది. దాని వల్ల అందులో ఏ వస్తువు పెట్టే అవకాశం ఉండదు. అలాంటి సమయంలో కొందరు స్క్రూ డ్రైవర్లను వాడుతుంటారు. వాటితో ఐస్ ను కొడుతూ తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. అలా చేసినపుడు ఫ్రిడ్జ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
Ads
డీప్ ఫ్రిడ్జ్‌లో సైడ్ కి లైన్స్ ఉంటాయి. వీటి ద్వారానే గ్యాస్ ప్రవహిస్తుంది. ఆ గ్యాస్ ప్రవహించడం వల్లనే ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది. స్క్రూ డ్రైవర్‌తో ఐస్ ను కొట్టినప్పుడు గ్యాస్ ప్రవహించే భాగానికి రంధ్రం పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గ్యాస్ లీక్ అయ్యీ, ఫ్రిడ్జ్ చల్లగా మారదు. అందువల్ల ఐస్ గడ్డ కట్టినపుడు దానిని తొలగించడానికి కొన్ని టిప్స్ పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. డీప్ ఫ్రిడ్జ్ లో తేమ ప్రవేశించడం వల్ల అందులో ఐస్ పేరుకుపోతుంది. అందువల్ల రిఫ్రిజిరేటర్ ను తరచూగా తెరవడం లేదా డోర్‌ని సరిగ్గా మూయకపోవడం వల్ల గ్యాప్ ఏర్పడి తేమ ప్రవేశిస్తుంది. కాబట్టి అలాంటి చేయకూడదు.
2.ఐస్ గడ్డ కట్టినపుడు నెంబర్‌ను తగ్గించి, మధ్యలో ఉండేటువంటి బటన్ ను నొక్కాలి. అప్పుడు రిఫ్రిజిరేటర్ చల్లదనం పూర్తిగా తగ్గి, ఐస్ కరుగుతుంది.
3.క్రమం తప్పకుండా ఫ్రిజర్ను శుభ్రం చేస్తూ ఉండాలి. అంతే కాకుండా ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ కూడా చేస్తుండాలి. ఫ్రిజ్‌ను గంట పాటు ఆఫ్ చేసినా ఫలితం ఉంటుంది.
4.రిఫ్రిజిరేటర్ లోని కండెన్సర్ కాయిల్ పై డస్ట్ పేరకుపోయినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. అందువల్ల కండెన్సర్ కాయిల్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి.
Also Read: ఈ చిట్కాలు పాటిస్తే సమ్మర్లో కూడా ఇల్లు చల్లగా ఉంటుంది..