ఈ చిట్కాలు పాటిస్తే సమ్మర్‌లో కూడా ఇల్లు చల్లగా ఉంటుంది..

Ads

ఎండాకాలం వచ్చేసింది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇప్పటికే ఇంట్లో ఉన్న పాత కూలర్లను శుభ్రం చేసే పనిని మొదలు పెట్టారు. కూలర్లు లేనివారు కొనేందుకు సిద్ధం అవుతుంటారు.

Ads

ఇక కూలర్లు, ఏసీలు చల్లదనంను ఇస్తాయని తెలిసిందే. అయితే ఏసీలు, కూలర్లతోనే కాకుండా ఇంటిని చల్లగా చేయడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఉన్నంతలో చల్లగా మారుతుంది. అలాగే వీటి కారణంగా సమస్యలు కూడా ఉండవు.  మరి ఆ చిట్కాలు ఏమిటో? ఆ చిట్కాల ద్వారా ఇల్లు ఎలా కూల్ గా అవుతుందో ఇప్పుడు చూద్దాం..
సమ్మర్ లో వీలైనంత వరకు కూడా తలుపులను, కిటీకిలను తెరిచి పెట్టాలి. ఉదయం ఎక్కువ వేడిగా ఇండడం వల్ల ఇంట్లో వేడి పెరుగుతుంది. అందువల్ల సాయత్రం ఎండ తగ్గిన అనంతరం తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. ఇలా చేయడంతో ఇంటి లోపల ఉండే వేడి గాలి బయటకు వెళ్తుంది. అలాగే బయటి నుండి చల్లని గాలి లోపలికి వస్తుంది.
విండో, డోర్‌ కర్టెన్స్‌ వాడకంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. కర్టెన్లు వీలు అయినంతవరకు వరకు లేత రంగులలో ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా తెలుపు రంగు కర్టెన్స్ అయితే మంచిది. వైట్‌ కలర్‌ వేడిని అబ్జార్బ్ చేసుకోదు. ముదురు రంగులు త్వరగా వేడిని అబ్జార్బ్ చేస్తాయి.
ఈ మధ్య కాలంలో మార్కెట్లో గడ్డితో తయారయిన కర్టెన్స్‌ దొరుకుతున్నాయి. వీటిని కూడా వినియోగించుకోవచ్చు. ఈ కర్టెన్స్‌ ఎక్కువగా దుకాణాల వంటి వాటికి బాగా ఉపయోగపడతాయి. ఈ కర్టెన్స్‌ పై నీటిని తరచూగా చల్లడం ద్వారా ఇంట్లోకి చల్లని గాలి వస్తుంది.
ఎండకాలంలో ఇంటి లోపల మొక్కలను పెంచుకోవడం ద్వారా కూడా చల్లదనం ఏర్పడుతుంది. మొక్కలు చల్లని గాలిని ఇస్తాయి. ఆ మొక్కలకు నీటిని పోయడం వల్ల ఆ గదికి చల్లదనం వస్తుంది.
ఎండకాలంలో ఇంట్లో వాడే బల్బ్ ల విషయంలో కూడా  కొన్ని మార్పులు చేయాలి. ఎర్రపు రంగు బల్బులకు బదులుగా తెల్లని బల్బులను వాడాలి. దీనివల్ల ఇంట్లో వేడి తగ్గుతుంది.
Also Read: ”టాయిలెట్ పేపర్” వలన ఇన్ని నష్టాలా..? చూస్తే మీరూ ఉపయోగించరు..!

Previous articleఎన్టీ రామారావుకి యాడ్‌లో నటించడానికి ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసా..!
Next articleమరణించిన త‌రవాత విడుద‌లైన 6 టాప్ స్టార్స్ సినిమాలు ఏమిటో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.