Ads
సాధారణంగా నగరాలలో నివసించే వారు ఎప్పుడో ఒకసారైనా షాపింగ్ మాల్స్ వెళ్ళే ఉంటారు. ఎక్కువగా పండగల సమయంలో చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అలా షాపింగ్ మాల్స్ లో టాయిలెట్లకి తలుపులు ఉంటాయి కానీ వాటి దిగువ భాగంలో కొంచెం ఓపెన్‌గా ఉంటాయి.
Ads
అయితే ఇలా షాపింగ్ మాల్స్ లోనే కాకుండా ఆఫీసుల్లో, ఎయిర్‌పోర్టులు లాంటి పబ్లిక్ ప్లేసెస్‌లో కూడా ఇలాంటి తలుపులే టాయిలెట్లకి ఉంటాయి. ఇంతకీ టాయిలెట్స్ దిగువ భాగంలో అలా ఎందుకు ఓపెన్ గా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇలా ఓపెన్ గా ఉంచడానికి కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే టాయిలెట్ తలుపులు చిన్నగా ఉండడం వల్ల తేలికగా శుభ్రం చేయవచ్చు. అంతేకాకుండా కిందికి ఉండడం వల్ల నీరు వాటికి తాకడం కారణంగా తలుపులు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టాయిలెట్ లో ఉన్న వ్యక్తికి ఏదైనా ఆకస్మిక అనారోగ్య సమస్య వచ్చినట్లయితే, ఆ విషయం తేలికగా తెలుస్తుంది. దాంతో తలుపును తెరిచి ఆ వ్యక్తిని కాపాడే అవకాశం ఉంటుంది.ఈ తలుపుల వల్ల ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే టాయిలెట్‌లో ఎవరైనా ఉన్నప్పుడు,ఆ విషయం బయటి ఉన్న వారికి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు వేరే టాయిలెట్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టాయిలెట్‌లలో కొంత మంది శృంగార కార్యకలాపాలు చేస్తుంటారు. అలాంటి పనులు జరగకుండా ఉండేందుకు టాయిలెట్ తలుపు కింది భాగం ఓపెన్ ఉండేట్టు డిజైన్ చేస్తారు.ఎందుకంటే ఎవరైన చూస్తారనే భయంతోఅయినా అలాంటి పనులు చేయరు.కొందరికి టాయిలెట్స్ లో ధూమపానం చేస్తుంటారు. అయితే కింది భాగంలో ఓపెన్ గా ఉన్న టాయిలెట్లలో ధూమపానం చేసినపుడువెంటనే తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో టాయిలెట్ లోపల వారితో వార్తాపత్రికలు, మొబైల్ ఫోన్‌ల లాంటి అవసరమైన వస్తువుల మార్పిడి చేసుకోవడానికి తలుపులు తెరవాల్సిన అవసరం లేకుండా వీలు కల్పిస్తాయి.
Also Read: పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ పై కనిపించే పాప ఎవరో తెలుసా?