Ads
మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఎప్పుడూ మర్చిపోలేని విధంగా గుర్తుకొస్తాయి. ఇదే తరహా సంఘటన ఒకటి టాలీవుడ్ నటుల జీవితాల్లో ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా జరిగింది. ఆ సంఘటన కేవలం టాలీవుడ్ నటులనే కాదు యావత్ సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. 1993 నవంబర్ 15న జరిగిన ఈ ఘటన ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఒక మరపురాని ఘట్టంగా మిగిలిపోయింది.
ఎక్కువగా తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా చెన్నైలో ఉంటున్న రోజులవి. పండుగ కావడంతో కుటుంబంతో కలిసి మన అగ్ర సినీ తారలు ఎంతో మంది ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. వీరితో పాటుగా కొందరు తమిళ్ స్టార్స్ కూడా ఉన్నారు. చెన్నై టు హైదరాబాద్ బయలుదేరిన ఫ్లైట్ గాల్లో ఉండగానే టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దానికి తోడు ఇంధనం కూడా నిండుకుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తడి పొలాలలో క్రాష్ ల్యాండింగ్ చేశారు.
Ads
ఆఫ్లైట్లో ప్రయాణిస్తున్న 272 మందిలో 60 మందికి పైగా సినీ ప్రముఖులు ఉన్నారు. చిరంజీవి బాలకృష్ణ అల్లు రామలింగయ్య ,విజయశాంతి, కోడి రామకృష్ణ ,సుధాకర్ దర్శకుడు బాపు , డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి ఇలా ఎందరో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తమ కుటుంబంతో సహా ఫ్లైట్లో ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ సేఫ్ గానే బయటపడ్డారు కానీ ఈ ఇన్సిడెంట్ ఒక్కసారి చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.
వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు, బట్టలపల్లి ,గుండ్లపల్లి మధ్య ఈ ఫ్లైట్ ఎమర్జెన్సీ లాండింగ్ సంభవించింది.కెప్టెన్ భల్లా, కో పైలెట్ వేల్ రాజ్ ఎంతో సమయస్ఫూర్తితో తడి పొలాలపైని ఫ్లైట్ ని భద్రంగా లాండ్ చేశారు. సరిగ్గా విమానం ఆగిన ప్రదేశానికి కాస్త ముందు ఒక పెద్ద బండరాయి దాని తర్వాత పెద్ద చెరువు ఉన్నాయి. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అది చూడడానికి వచ్చిన జనం మొదట అదేదో షూటింగ్ అని భావించారట ఆ తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యారట. దీని గురించి విజయశాంతి ఒకసారి ఇంటర్వ్యూలో కూడా పేర్కొనడం జరిగింది.