మహేష్ బాబు డైలాగ్ ఒరిజినల్ కాదా…ఈ మూవీ నుంచి కాపీ కొట్టిందా?

Ads

ప్రస్తుతం వస్తున్న సినిమాలలో చాలావరకు టైటిల్స్ పాత సినిమాలవి రావడం మనకు తెలుసు. కొన్ని కొన్ని సినిమాలలో పాత పాటలు కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే మక్కి టు మక్కి కొన్ని సీన్స్ మరియు డైలాగ్స్ ని కూడా సినిమాల్లో దించేస్తున్నారు అని ఈమధ్య తెలుస్తోంది. ఇటువంటి సందర్భం మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విషయంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే శ్రీకాంత్ ,సౌందర్య ,నాగార్జున కాంబినేషన్లో వచ్చిన నిన్నే ప్రేమిస్తా సినిమా సెప్టెంబర్ 14 ,2000 రిలీజ్ అయింది. ఈ సినిమాలో కళ్ళు పోయిన శ్రీకాంత్ కి చనిపోయిన నాగార్జున కళ్ళు పెట్టడం జరుగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రేమ కథ చిత్రం చాలా సార్లు మనం టీవీలో చూసి ఉంటాం.ఈ మూవీలో బ్యాంక్ ఎంప్లాయ్ గా శ్రీకాంత్ మరియు అతని ఫ్రెండ్ లా సుధాకర్ మధ్య ఎన్నో ఫన్నీ సీన్స్ ఉన్నాయి.

Ads

చాలా వరకు ఆ సీన్స్ ఒక్కసారి చూస్తే రెండోసారి గుర్తుండి పోయే విధంగా ఎంతో సింపుల్ గా ఉంటాయి. వాటిలో ఒకటే బ్యాంక్ గుడి లాంటిది అని చెప్పే ఒక సన్నివేశం. అసలు ఆ డైలాగ్ ఏమిటంటే “డబ్బు అంటే లక్ష్మి. ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంకులో. ఆ బ్యాంకు గుడి లాంటిది అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని శ్రీకాంత్ ఆ ఊరి ప్రజలకు బ్యాంకు పై విలువను పెంచడానికి ప్రయత్నిస్తూ చెబుతాడు.

మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే డైలాగ్ నటించిన సర్కారు వారి పాట మూవీలో ఉంది. నిన్నే ప్రేమిస్తా చిత్రం విడుదలైన 22 సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన ఈ మూవీలో సేమ్ డైలాగ్ ఉండడంతో.. నేటిజన్స్ తమ టాలెంట్ కు పని చెప్పి దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుందే…అని క్యాప్షన్స్ పెట్టి మీమ్స్ కూడా చేస్తున్నారు.

Previous articleతృటిలో తప్పిన ప్రమాదం.. లేకపోతే స్టార్ హీరోలు గల్లంతే..
Next articleఅప్పటి స్టార్ హీరోలలో పారితోషికం ఎవరు ఎక్కువ తీసుకునేవారో తెలుసా?