Ads
లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకి అందరు అలవాటు పడ్డారు. ఎన్నో ఓటీటీ సంస్థలు ఉన్నా కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ గురించి ప్రత్యేకించి చెప్పాలి. కారణం ఏమిటి అంటే తెలుగు సినిమాలను ఎక్కువ ధరకు కొని బయ్యర్స్ పాలీట కల్ప వృక్షంగా మారింది.
ప్రస్తుతం రూల్స్ మారిపోయాయి. అది మాత్రమే కాక అమెజాన్ ప్రైమ్ కి సబ్స్క్రైబర్స్ బాగా ఉండేవారు. అయితే కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ తో థియేటర్లు మూసేయడంతో మామూలుగా ఉన్న వాడకం బాగా పెరిగింది. లాక్ డౌన్ సమయంలో కొత్త సినిమాలను ఎక్కువగా డైరెక్ట్ విడుదల చేసింది కూడా ఈ ఓటీటీనే. ఈ మధ్య కాలంలో అమెజాన్ ప్రైమ్ లో భారీగా వ్యూయర్ షిప్ ను అందుకున్న సినిమాలు ఏమిటో, ఏ సినిమాలు టాప్ 10 జాబితాలో ఉన్నాయో చూద్దాం రండి.
Ads
1) పుష్ప:
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆడియెన్స్ ఎక్కువగా చూసిన సినిమాగా నిలిచింది.
2) కేజిఎఫ్ చాప్టర్ 2:
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన ఈ మూవీకి అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఉంది.
3)కేజిఎఫ్ చాప్టర్ 1 :రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ 3 ప్లేస్ లో ఉంది.
4) సీతా రామం :
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లు గా రష్మిక మందన ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రైమ్ లో టాప్ 4 ప్లేస్ ను దక్కించుకుంది.
5) పొన్నియన్ సెల్వన్:
మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ మల్టీస్టారర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 5 ప్లేస్ లో ఉంది.
6) బచ్చన్ పాండే :
అక్షయ్ కుమార్,కృతి సనన్ కలిసి నటించిన ఈ బాలీవుడ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 6వ ప్లేస్ ను దక్కించుకుంది.
7) జుగ్ జుగ్ జియో :
అనిల్ కపూర్, కియారా అద్వానీ లాంటి యాక్టర్స్ నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 7వ మూవీగా నిలిచింది.
8) రన్ వే 34 :
అజయ్ దేవగన్ నటిస్తూ, నిర్మించి మరియు దర్శకత్వం చేసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 8వ మూవీగా నిలిచింది.
9) జురాసిక్ వరల్డ్ డొమైన్ :
ఈ హాలీవుడ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 9వ మూవీగా నిలిచింది.
10) గెహ్రయన్ :
దీపికా పదుకొనె నటించిన ఈ బాలీవుడ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 10వ మూవీగా నిలిచింది.
Also Read:ఈ ఏడాదిలో మరణించిన 10 మంది తెలుగు సినీ ప్రముఖులు..