Ads
ఇండియన్ రైల్వేస్ గురించి తెలియని వారు ఉండరు. దేశంలోని ప్రజలకు రవాణా సేవలు అందిస్తూ ప్రతిరోజు సుమారు 13,169 ప్యాసింజర్ ట్రైన్స్ నడిపే అతిపెద్ద సంస్థ ఇండియన్ రైల్వేస్. మన ఇండియన్ రైల్వేస్ లో ప్రధానంగా పెద్ద స్టేషన్లో గా గుర్తించబడినవి ఐదు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ద్ద ట్రైన్ నెట్వర్క్ లో భారతీయ రైల్వేస్ నాలుగవ స్థానంలో ఉంది. మరి ఈ ఐదు ప్రధాన రైల్వే స్టేషన్స్ గురించి తెలుసుకుందాం…
#1. హౌరా రైల్వే జంక్షన్
భారత్ రైల్వే నెట్వర్క్ లో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా రైల్వే జంక్షన్. కోల్‌కతా కి గర్వకారణంగా భావించే ఈ హౌరా స్టేషన్లో 23 ప్లాట్ఫార్మ్ లు ,26 ట్రాకులు ఉన్నాయి ప్రతిరోజు ఈ స్టేషన్ ద్వారా 133 రైళ్లు ,300 ప్యాసింజర్ రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
#2. సీల్దా రైల్వే స్టేషన్
భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ “సీల్దా రైల్వే స్టేషన్” గురించి మీకు తెలుసా.. ఇది నిన్నా ..మొన్నా కట్టిన స్టేషన్ కాదు.. 158 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే స్టేషన్ ఇది. రోజు ఈ స్టేషన్ నుంచి 320 రైలు సుమారు 12 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేరుస్తాయి.ఈ రైల్వే స్టేషన్లో మొత్తం మీద 24 ట్రాక్లతో పాటు 21 ప్లాట్ఫారం లో ఉన్నాయి.
Ads
#3. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్
మూడవ స్థానంలో ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఉంది. 20 ట్రాక్టర్ తో ,18 ప్లాట్ఫార్ములతో ఉండే ఈ స్టేషన్ ను బ్రిటిష్ టైం లో విక్టోరియా టెర్మినస్ అనేవారు. ఇక్కడ నుంచి రోజుకు 30 ప్యాసింజర్ ట్రైన్ నడుస్తాయి.
#4. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్
4వ స్థానంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశం లోని అత్యంత రద్దీతో కూడిన రైల్వేస్టేషన్ గా గుర్తింపు పొందింది. ప్రతిరోజు కనీసం ఇక్కడ నుంచి 200 కు పైగా ప్యాసింజర్ రైలు ప్రయాణిస్తాయి. ఈ స్టేషన్ 18 ట్రాక్కులతో ,16 ప్లాట్ఫార్మర్లతో ఎప్పుడు హడావిడిగా, రద్దీగా ఉంటుంది.
#5. చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్
చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇండియాలోని టాప్ ఫైవ్ రైల్వే స్టేషన్లో ఒకటి. ఈ స్టేషన్ నుంచి రోజుకు సుమారు 50 లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. 30 ట్రాక్టర్ మరియు 12 ప్లాట్ఫారంలో కలిగిన ఈ స్టేషన్ కూడా ఎప్పుడు రద్దీగానే ఉంటుంది.