కళ్యాణ్ రామ్ తో నటించిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా.? ఆమె యాక్టర్ అవ్వకముందు ఏం చేసేవారంటే.?

Ads

ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ మామూలుగా ఉండేట్టుగా లేదు. కంటెస్టెంట్స్ ఒకరిని మించి ఒకరు ఉండడమే ఇందుకు ముఖ్యమైన కారణం. ఈసారి ఎలాగైనా షోని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలి అని మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో జలక్కులతో పాటు హౌస్ మేట్స్ కి ముప్పు తిప్పలు పెట్టే టాస్కులు కూడా రెడీ అవుతున్నాయి మరి.

bigg boss telugu 7 subhashree rayaguru

వచ్చి రావడంతోటే సూట్కేస్ తో నాగార్జున కంటెస్టెంట్స్ కి రేంజ్ షాక్ ఇచ్చి హౌస్ లోకి పంపించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న ఈ బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షోలో లాయర్ గా మారిన యాక్టర్ ఎంట్రీ ఇవ్వడం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆమె ఎవరో కాదు రుద్రవీణ ఫీమ్ శుభశ్రీ రాయగురు. హౌస్ లోకి ఐదో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళ్ మరియు తెలుగులో ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేశారు. కళ్యాణ్ రామ్ “అమిగోస్” చిత్రంలో కూడా ఒక చిన్ని పాత్రలో ఆమె కనిపించారు.

Ads

bigg boss telugu 7 subhashree rayaguru

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినా సమ్మోహనుడా సాంగ్ తో అందరినీ సమూహణ పరిచే పెర్ఫార్మెన్స్ ఇస్తూ బిగ్ బాస్ స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ఒడిస్సా బ్యూటీ వచ్చిరాని తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె తెలుగు గురించి నాగార్జున అడిగినప్పుడు తెలుగు కొంచెం వచ్చు.. కానీ తెలివి చాలా ఉంది అని ఆన్ స్టేజ్ కౌంటర్ ఇచ్చింది శుభశ్రీ. ఈమె కేవలం లాయర్ లేక నటి మాత్రమే కాదు మంచి స్పోర్ట్స్ ప్లేయర్ కూడా. అంటే బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్లలో అబ్బాయిలు జర భద్రంగా ఉండాలి మరి.

ALSO READ : బిగ్‌బాస్ తెలుగు-7 కంటెస్టెంట్ గా వచ్చిన “రతిక” ఎవరో తెలుసా..? ఆమె నటించిన సినిమాలు ఏవంటే..?

Previous article“చంద్రముఖి 2” ట్రైలర్ లో ఈ సీన్ ని ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
Next articleఇండియాలో టాప్ 5 అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఇవే…మన తెలుగురాష్ట్రాల్లోవి ఏ స్టేషన్ అయినా ఉందేమో చూడండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.