Ads
ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన చిత్రం ఆది పురుష్. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలై ఎన్నో కాంట్రవర్సీస్ కి తెరలేపిన ఈ చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేసింది.
మూవీ విడుదలైన రెండో రోజు నుంచి చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని.. రామాయణాన్ని తప్పుగా చూపించారని.. హనుమంతుడు మాస్ డైలాగ్స్ చెబుతాడా అని రకరకాలుగా ఈ మూవీని ట్రోలింగ్ చేశారు.
ముఖ్యంగా ఇందులో రావణాసురుడి వేషధారణ ,స్వర్ణలంకను బొగ్గులంకగా చూపించడం, రామాయణంలోని పలు సన్నివేశాలను ఇష్టానుసారంగా మార్చడం పై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు. అయితే గత కొద్ది కాలంగా ఈ మూవీ గురించి ఎక్కడ ఎటువంటి గాసిప్ లేదు. అయితే సడన్ గా నిన్న చంద్రయాన్ సక్సెస్ తో తిరిగి ఆది పురుష్ పై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది.
Ads
ఇంతకీ సంగతేంటంటే చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వడంతో పూర్తి మిషన్ కోసం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ను వివిధ చిత్రాల బడ్జెట్తో సోషల్ మీడియా వేదికగా పోల్చడం జరిగింది. మొత్తం చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ అయిన ఖర్చు 615 కోట్లు. ప్రస్తుతం విడుదల అయినటువంటి ఎన్నో చిత్రాలతో పోల్చుకుంటే ఈ బడ్జెట్ చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 700 రూపాయల కోట్లకు బడ్జెట్ తో ధరకెక్కిన ఆది పురుష్ చిత్రాన్ని నేటిజన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు.
ఆది పురుష్ లాంటి చెత్త సినిమాలకు…ద్రాక్ష గుత్తులు లాంటి దశకంఠుడు తలలు చూపించడానికి వాడే బడ్జెట్ ఇలా దేశానికి ఉపయోగపడే వాటికి వాడితే బాగుంటుంది అని సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు రీసెంట్ గా విడుదలైన ‘ఓపెన్‌హైమర్’ మూవీ బడ్జెట్ 800 కోట్లకు పైగా ఉంటే…స్పేస్ కాన్సెప్ట్ తో పది సంవత్సరాల క్రితం విడుదలైన ఇంటర్‌స్టెల్లార్ మూవీ బడ్జెట్ సుమారు 1350 కోట్లు. ఈ నేపథ్యంలో చెత్త ఎంటర్టైన్మెంట్ కి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వడం లేదని నెటిజెన్స్ తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారత్ కీర్తి పతాకాన్ని ప్రపంచం ముందు ఘనంగా నిలబెట్టిన ఇస్రోపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.