Ads
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ అలాగే సినీ కెరీర్ లో కూడా చాలామంది మిత్రులు, అలాగే తనతో పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లని ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు కానీ ఆఖరికి అందరూ ఎన్టీఆర్ ని పొగుడుతూనే మాట్లాడతారు. ఎన్టీఆర్ కి ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం ఉంటుంది. దీని గురించి చాలామంది ఎన్టీఆర్ స్నేహితులు, తనతో కలిసి పనిచేసిన వ్యక్తులు ఇంటర్వ్యూలలో చెప్పుకొని వచ్చారు.
అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్లు కూడా ఎన్టీఆర్ తో పనిచేసిన వాళ్ళే. ఈయనెవరో కాదు తుమ్మల నాగేశ్వరరావు. ఈయన ఒక రాజకీయ నాయకుడు. తుమ్మల గారు 1982 నుండి, ప్రతి సంవత్సరం కమ్మ సంఘం సమావేశానికి ప్రజా ప్రతినిధిగా హాజరు అవుతూ ఉంటారట. కమ్మగా పుట్టడం నా అదృష్టం అని ఆయన చెబుతుంటారు. ఓ సారి అమీర్‌పేట కమ్మ సంఘం వేడుకకు మొత్తం 50 మంది శాసన సభ్యులు ఉన్నప్పటికీ నేను ఒక్కడినే హాజరు అయ్యాను అని చెప్పారు.
Ads
అయితే ఈ విషయం మీద ఎన్టీఆర్ తనని పిలిచి తనతో, ఎందుకు ఆ సభకి వెళ్లారు అని అడిగారట. దానికి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కమ్మవాడినే. అక్కడే పుట్టాను నేను ఆ కులంలో పుట్టడం నా అదృష్టం. అందుకే అక్కడికి వెళ్లాను అని చాలా గర్వంగా చెప్పుకున్నాను. అప్పుడు ఎన్టీఆర్ గారు లేచి నన్ను హత్తుకున్నారు. ఆయన చాలా విచిత్రమైన మనిషి. నాతో మాట్లాడుతూ ఒకరు వాళ్ల కులాన్ని ప్రేమించడం మంచిదే కానీ మిగిలిన కులాలని ద్వేషించడం తప్పు.
ఇప్పుడు నువ్వు కమ్మ సంఘానికి హాజరైతే దానివల్ల పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే అడిగాను. నేను నా చుట్టుపక్కల వారిని ఎప్పుడూ నా కులం అని చెప్పి దగ్గరకు తీసుకోను. నాతో ఉన్న వాళ్ళ ఎవరి కులాలు, మతాలు కూడా నాకు సరిగ్గా తెలియదు. నా వర్కింగ్ స్టైల్ అంతే. ఒక మనిషి తను ఎలా పని చేస్తున్నారు, తన ఆలోచనలేంటి అని మాత్రమే చూస్తాను. అంతేకానీ ఈ కులాలు, మతాలు పట్టించుకోను అని చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన స్టైల్ అంతే అని ఎన్టీఆర్ ని పొగుడుతూ మాట్లాడారు.