విశాఖ నుండి బహుమతి… మూడు రోజులపాటు వేడుక..! అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్-2 ఈసారి ఎలా ప్లాన్ చేశారంటే..?

Ads

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళికి ముందు మరొక వేడుక చేసుకోబోతున్నారు. కొన్ని నెలల క్రితం జాంనగర్ లో అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు వేడుకలు జరిగాయి. ఈసారి మాత్రం యూరప్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు. యూరప్ లో కూడా ఒక క్రూజ్ లో ఈవెంట్స్ జరగబోతున్నాయి. మొన్న జరిగిన ఈవెంట్స్ లాగానే ఈసారి ఈవెంట్స్ కి కూడా బాలీవుడ్ ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఇప్పటికే వాళ్లందరూ యూరప్ కి బయలుదేరారు. మే 28వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ వేడుకలు జరుగుతాయి.

highlights of ambani second pre wedding celeration in europe

ఈ క్రూజ్ లో ఇటలీలో మొదలుపెట్టి దక్షిణ ఫ్రాన్స్ వరకు వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ తిరిగి వస్తారు. 29వ తేదీన ఈ క్రూజ్ లో ఒక స్టార్ నైట్ జరుగుతుంది. అందులో కూడా బాలీవుడ్ నుండి వచ్చిన ప్రముఖులు అలరిస్తారు అని సమాచారం. ఈసారి అతిధులకి సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయడం మాత్రమే కాకుండా, ఎంతో ఖరీదైన బహుమతులు కూడా ఇవ్వాలి అని అంబానీ కుటుంబం అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి.

Ads

31వ తేదీ అందరూ రోమ్ లో ఆగి అక్కడ రోజ్ కేన్స్ లో పార్టీ చేసుకుంటారు. ఇంత ఘనంగా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఈసారి కూడా అంబానీ ఇంత వేడుకలు అంటే ఎలా ఉంటాయి అనేది అంతర్జాతీయ వ్యాప్తంగా చూపించబోతున్నారు. ఇదిలా ఉండగా, వైజాగ్ నుండి ఒక వ్యక్తి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కోసం ఒక బహుమతి తయారు చేశారు. బహుమతి అంటే అది సాధారణమైన బహుమతి కాదు. ఎంతో ఆలోచించి ఒక మంచి ఆలోచనతో ఈ బహుమతి తయారు చేశారు. విశాఖపట్నంకి చెందిన మోకా విజయ్ కుమార్ గారు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెయింటింగ్ రూపొందించారు.

దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఈ చిత్రపటాన్ని చిరుధాన్యాలతో రూపొందించారు. ఈ బహుమతిని అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కి ఇవ్వాలి అని విజయ్ కుమార్ గారు పంపిస్తున్నారు. ఈ చిత్రపటం తయారు చేయడానికి పది రోజులు పట్టింది. విజయ్ కుమార్ గారు గతంలో కూడా చిరుధాన్యాలు ఉపయోగించి ఎన్నో చిత్రపటాలు రూపొందించారు. భారతీయ రైల్వేలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. నరేంద్ర మోదీ, వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు, ఇంకా ఎంతో మంది ప్రముఖుల చిత్రపటాలని చిరుధాన్యాలతో విజయ్ కుమార్ గారు రూపొందించారు. గత సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో కూడా విజయ్ కుమార్ గారు రూపొందించిన చిత్రపటాలని ప్రదర్శించారు.

Previous articleఎన్టీఆర్ తో ఉన్న ఈ రాజకీయనాయకుడు ఎవరో గుర్తుపట్టారా.?
Next articleఅర్జున్ మంచి తండ్రి కాదు… చాలా చెడ్డ తండ్రి… అంతకంటే చెడ్డ భర్త..! అందుకు కారణాలు ఇవే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.