కొరటాల శివకి పోసాని కి మధ్య సంబంధం ఏమిటి..? అందుకే ఆయన దగ్గర అసిస్టెంట్ గా..?

Ads

కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొరటాల శివ మనందరికీ సుపరిచితమే. సినిమా రంగం లోకి కొరటాల శివ బీటెక్ పూర్తి చేసిన తర్వాత వచ్చారు. ప్రస్తుతం తెలుగు సినిమా రచయితగా దర్శకుడుగా పేరు పొందుతున్నారు. 1998లో ఉద్యోగాన్ని చేస్తూ కొరటాల శివ తనకు బావ వరుస అయిన పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ గా కొరటాల శివ చేరారు.

కొరటాల శివ మున్నా, బృందావనం. ఒక్కడున్నాడు, ఊసరవెల్లి వంటి సినిమాలకి మాటల రచయితగా పనిచేశారు. కొరటాల శివ మొట్టమొదట దర్శకత్వం వహించిన సినిమా మిర్చి.

2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాకి దర్శకుడుగా పనిచేశారు. ఆ తర్వాత కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా చాలా సినిమాలకి దర్శకత్వం వహించారు. 2013లో ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు గా నంది పురస్కారాన్ని అందుకున్నారు కొరటాల శివ. అయితే చాలామంది రైటర్లు కింద ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్లుగా మారిపోయారు.

Ads

త్రివిక్రమ్ వంటి వాళ్లు ఇలా రైటర్ల నుండి దర్శకులు అయ్యారు కొరటాల శివ కూడా అదే తీరుని ఎంచుకున్నారు. రైటర్ గా పని చెయ్యడం మొదలుపెట్టి ఇప్పుడు టాప్ డైరెక్టర్ అయ్యారు. కొరటాల శివ చాలా సినిమాల్లో పని చేశారు పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ గా ఉంటూ పని నేర్చుకున్నారు.

భద్ర సినిమాకి కూడా రైటర్ గా పని చేశారు. ఆ సినిమా కొరటాల శివ కి మంచి పేరు తీసుకువచ్చింది. పోసాని కృష్ణ మురళి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారు. పోసాని కృష్ణ మురళి దగ్గర పని చేస్తున్నప్పుడు ఆయన శివని తిట్టేవారు అయినా సరే వాటిని భరిస్తూ కెరీర్ లో సక్సెస్ ని అందుకున్నారు. కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నారు. కొరటాల శివ తొందరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు.

Previous article”విక్టరీ వెంకటేష్” గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇవి..!
Next articleయూఎస్ఏ లో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన… టాప్ 10 సినిమాలు ఇవే..!