Ads
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లోనే ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : ఫ్యామిలీ స్టార్
- నటీనటులు : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.
- నిర్మాత : రాజు – శిరీష్
- దర్శకత్వం : పరశురామ్
- సంగీతం : గోపీసుందర్
- విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2024
స్టోరీ :
గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక చిన్న కంపెనీలో ఆర్కిటెక్ట్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కుటుంబానికి చాలా విలువ ఇచ్చే మనిషి. గోవర్ధన్ కి ఇద్దరు అన్నలు ఉంటారు. గోవర్ధన్ కుటుంబం బాధ్యతలు మొత్తం తనే చూసుకుంటాడు. గోవర్ధన్ కి తెలియకుండా వారి పెంట్ హౌస్ లో ఇందు (మృణాల్ ఠాకూర్) కి అద్దెకి ఉండడానికి గోవర్ధన్ కుటుంబం అనుమతి ఇస్తారు. తర్వాత ఆ విషయం గోవర్ధన్ కి తెలుస్తుంది.
గోవర్ధన్, ఇందుతో ప్రేమలో పడతాడు. కానీ తర్వాత ఇందు రావడానికి అసలు కారణం తెలుస్తుంది. దాంతో కోపగించుకున్న గోవర్ధన్, తన లైఫ్ స్టైల్ అంతా మారిపోవాలి అనే ఉద్దేశంతో, ఒక పెద్ద వ్యక్తి (జగపతిబాబు) స్థాపించిన కంపెనీలో చేరతాడు. అసలు ఇందు ఎవరు? గోవర్ధన్ ఇలా ఎందుకు మారాడు? తర్వాత వాళ్లు ఫారిన్ ఎందుకు వెళ్లారు? గోవర్ధన్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ప్రతి సినిమాకి ప్రేక్షకుడు కథ కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో వెళ్ళడు. ఒక మూడు గంటలు తన ప్రపంచాన్ని మర్చిపోయి ఒక థియేటర్ లో కూర్చుంటే, తన ప్రపంచాన్ని మరిపించే అంత గొప్ప సినిమా ఉండాలి అని అనుకుంటాడు. అన్నీ వదిలేసి ఆ సినిమాలో లీనం అయిపోవాలి అని అనుకుంటాడు. పాత్రలు ఎమోషనల్ గా చేస్తే తాను కూడా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలి. పాత్రలు నవ్వితే తాను కూడా నవ్వాలి. అలా ఒక పాత్రని ప్రేక్షకులు రిలేట్ చేసుకుంటే సినిమా హిట్ అయినట్టే. అది కూడా ఇలాంటి మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలకి రిలేట్ అయ్యే విషయాలు ఎంత బాగుంటే, వాటిని తెర మీద ఎంత బాగా చూపిస్తే అంత హిట్ అవుతాయి. కుటుంబానికి విలువ ఇవ్వడం. కుటుంబం కోసం ఎంత దూరం అయినా వెళ్లడం.
ఈ సినిమా కాన్సెప్ట్ ఇదే. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం కుటుంబం అనే ఎమోషన్ కి కనెక్ట్ చేయలేకపోయారు. హీరో పాత్రని అప్పుల అప్పారావు సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్ర లాగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా 2024 కి తగ్గ సినిమా అయితే కాదు అనిపిస్తుంది. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం కూడా ఇంతకంటే మంచి కాన్సెప్ట్ లు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ లో పెద్ద హై మూమెంట్స్ ఉండవు. అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ బలంగా ఉంటే సినిమా ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న సీన్స్ కి న్యాయం చేసేది. అసలు కొన్ని సీన్స్ అయితే ఎందుకు రాసుకున్నారో అర్థం కాదు.
Ads
ఉదాహరణకి, సినిమాలో హీరో ఫారిన్ కి వెళ్ళినప్పుడు లుంగీ వేసుకుంటాడు. అది చూసి మిగిలిన ఫారిన్ వాళ్ళు కూడా లుంగీ వేసుకుంటారు. కొంత మంది అమ్మాయిలు హీరోని వేరేగా అర్థం చేసుకొని, వారితో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ సీన్ చూడడానికి అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ పేరుతో వచ్చే కొన్ని సీన్స్ కూడా అలాగే ఉంటాయి. మిడిల్ క్లాస్ పేరుతో చూపించే కొన్ని సీన్స్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ తనకి ఇచ్చిన పాత్రలో తాను బాగా చేశారు. ఆ పాత్రకి అంతకంటే ఎక్కువ కూడా చేసేది ఏమీ లేదు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బాగా నటించారు. ఒక రకంగా సినిమాని ముందుకు తీసుకెళ్లే పాత్ర ఇది. మరొక మంచి పాత్రని ఎంచుకున్నారు.
సినిమాలో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. సీనియర్ నటి రోహిణి హట్టంగడి, వాసుకి, అభినయ, రోహిణి, జగపతి బాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను ఇలా చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కరి పాత్ర కూడా ప్రాపర్ గా రాసుకున్నట్టు అనిపించదు. కానీ వాళ్లకి ఇచ్చిన పాత్రల్లో వాళ్ళు నటించారు. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. వాళ్ళిద్దరి పెయిర్ చూడడానికి బాగుంది. KU మోహనన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అయితే, కథ ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే ఎడిటింగ్ కూడా బాగుండేది.
గోపి సుందర్ అందించిన పాటలు చూడడానికి, వినడానికి బాగున్నాయి. కానీ, కొన్ని చోట్ల అయితే అసలు పాటలు ఎందుకు వస్తాయి అనే విషయం కూడా అర్థం కాదు. పాట అవసరం లేని చోట్ల కూడా పాటలు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొన్ని చోట్ల బాగున్నా కూడా, కొన్ని చోట్ల ఇంకా బాగుంటే సీన్స్ ఇంకా ఎలివేట్ అయ్యేవి. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగున్నా కూడా ఎమోషన్స్ తెర మీద చూపించడంలో పొరపాట్లు చేశారు. ఈ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ
- పాటలు
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- బాగా తెలిసిన కథ
- కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
- కొన్ని అనవసరమైన సీన్స్
- పాటలు వచ్చే సందర్భాలు
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
హీరో – డైరెక్టర్ కాంబినేషన్ లో గతంలో ఒక సూపర్ హిట్ సినిమా వచ్చింది అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, ఈ సినిమా నుండి అసలు ఏమీ ఆశించకుండా, అసలు సినిమాలో ఏం చూపించారు అని తెలుసుకుందాం అనుకునే వారికి ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : బేబీ “వైష్ణవి చైతన్య” తో పాటు… ఈ 9 హీరోయిన్లు పోషించిన గుర్తుండిపోయే పాత్రలు ఇవే..!