బేబీ “వైష్ణవి చైతన్య” తో పాటు… ఈ 9 హీరోయిన్లు పోషించిన గుర్తుండిపోయే పాత్రలు ఇవే..!

Ads

సినిమాలలో హీరోయిన్ పాత్ర రాను రాను నామమాత్రంగా మారిపోతుంది. ఒక కమెడియన్ ..ఒక సైడ్ యాక్టర్…. ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎక్కడుందో ..ఎందుకు ఉందో తెలియని పరిస్థితుల్లో.. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు మాత్రమే తమ సినిమాల్లో చేసిన కొన్ని పాత్రలతో మన మనసులో చెరగని ముద్ర వేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరో తెలుసుకుందాం..

1. వైష్ణవి చైతన్య – బేబీ

రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఇరు తెలుగు రాష్ట్రాలను తన యాక్టింగ్ తో షేక్ చేసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. కొందరికి ఆమె నటన నచ్చితే….కొందరికి బేబీ మూవీ లో ఆమె రోల్ నచ్చలేదు…మొత్తానికి ఆమెను నెగ్లక్ట్ మాత్రం ఎవ్వరూ చేయలేరు. బేబీ మూవీ తో ఆమె క్రియేట్ చేసిన ఇంప్రెషన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.

heroines and their memorable characters

2. సాయి పల్లవి – ఫిదా

నాచురల్ హీరోయిన్ గా అందరి మనసులు కొల్లగొట్టిన సాయి పల్లవి..మోస్ట్ మెమరబుల్ మూవీ ఫిదా. ఇందులో ఆమె పాత్ర…నటన…. మెస్మెరైజింగ్.

heroines and their memorable characters

3. సమంత – మజిలీ

పెళ్లి తర్వాత నాగ చైతన్య తో కలిసి సమంత నటించిన మూవీ మజిలీ. ఈ మూవీ లో సమంత ఎంట్రీ షాట్ కు మొత్తం థియేటర్ దద్దరిల్లిపోయింది. ఒక స్టార్ హీరో ఎంట్రీ కి వచ్చిన అంత రెస్పాన్స్ సామ్ ఎంట్రీ కి వచ్చింది.

heroines and their memorable characters

4. కీర్తి సురేష్ – మహానటి

లెజెండ్ యాక్టర్ సావిత్రి బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి చిత్రంలో అలనాటి సావిత్రి పాత్ర ను కీర్తి సురేష్ పోషించింది. ఈ మూవీలో కీర్తి అద్భుతమైన నటనకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు.

Ads

heroines and their memorable characters

5. మృణాల్ ఠాకూర్ -సీతా రామం

సీతా రామం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్, మొదటి సినిమా తోటే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది.

heroines and their memorable characters

6. రీతూ వర్మ – పెళ్లి చూపులు

పెళ్లిచూపులు చిత్రంలో చిత్రగా రీతు వర్మ నటన ప్రేక్షకుల భావోద్వేగాలను తట్టిలేపింది.

heroines and their memorable characters

7. పాయల్ రాజ్‌పుత్ – RX 100

RX 100 మూవీ లో ఆమె నటించిన నెగటివ్ సైడ్ అయినప్పటికీ ఆ చిత్రం ఆమె తప్ప ఇంకెవరూ చేయలేదేమో అన్నట్టు ఉంటుంది పాయల్ రాజ్‌పుత్ యాక్షన్. డెబ్యూ మూవీ లోని ఇంత బోల్డ్ క్యారెక్టర్ అది కూడా నెగటివ్ షేడ్ తో చేయడం అంటే ఆషామాషీ కాదు.

heroines and their memorable characters
8. నిత్య మీనన్ – తిరుచిత్రంబలం

తిరుచిత్రంబలం మూవీ లో నిత్యా మీనన్ పాత్ర ప్రతి ఒక్కరి మనసుకి తెలియని హాయి కలిగిస్తుంది. ఇలాంటి మనిషి ఒకరు మన జీవితంలో తోడుగా ఉంటే బాగుండు అన్న భావన కలిగించే ఆ పాత్రకు నిత్య తప్ప ఇంకెవరు అంత బాగా చేయలేరెమో.

heroines and their memorable characters

9. త్రిష – 96

త్రిష నటించిన 96 మూవీ నిజంగా ఒక క్లాసిక్. చిన్ననాటి ప్రేమికుని దేవుని యందు కలుసుకున్నే అమ్మాయి పాత్ర లో త్రిష నటన అద్భుతం.

heroines and their memorable characters

Previous articleపూర్తిగా మారిపోయిన ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? కొత్త లుక్ సూపర్ కదా..?
Next articleFamily Star Review : విజయ్ దేవరకొండ హిట్ కొట్టారా..? ట్విట్టర్ టాక్ ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.