Ads
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. లోకేష్ మాట్లాడిన మాటలు క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఖైదీ మూవీతో హిట్ అందుకున్న లోకేష్ ఆ తరువాత మాస్టర్, విక్రమ్, వంటి సినిమాలతో అలరించారు. రీసెంట్ గా లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, ఇప్పటికే 500కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విక్రమ్ లో డిలీట్ చేసిన సీన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తమిళ హీరో కార్తితో ఖైదీ తీసి, లోకేష్ కనగరాజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ మూవీ తెలుగులోనూ విజయం సాధించింది. ఆ హిట్ తో లోకేష్ కు విజయ్ దళపతి వంటి అగ్ర హీరోతో మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. అలా మాస్టర్ మూవీ తీశారు. ఆ మూవీ తరువాత ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ ని సృష్టిస్తూ కమల్ హాసన్ తో విక్రమ్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ మూవీలో హీరో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్ పజిల్ నటించారు. ఈ మూవీలో ఈ ముగ్గురు హీరోల నటన, హీరో సూర్య గెస్ట్ రోల్ ద్వారా ఆడియెన్స్ మెప్పించారు. అయితే విక్రమ్ లో ఖైదీ మూవీలోని నెపోలియన్ ఉన్న సీన్ ఉందని, కానీ మూవీ నిడివి కారణంగా దానిని డిలీట్ చేశామని, నెక్స్ట్ పార్ట్ లో ఈ సీన్ ని పెడతామని ఒక ఇంటర్వ్యూలో లోకేష్ వెల్లడించారు. ఆ సీన్ గురించి చెప్పారు. విక్రమ్ మూవీ ఇంటర్వెల్ తరువాత ఫాహద్ పజిల్ రోల్ విక్రమ్ ఎవరు అని చెప్తుంటారు.
కమల్ హాసన్ ఫోటో రాకముందు పక్క రూమ్ నుండి డిస్కషన్ వినిపిస్తూ ఉంటుంది. అందులో హ్యూమన్ రైట్స్ సభ్యులు ఉంటారు. అక్కడ ఒక మహిళ ఒక వ్యక్తితో ఆ వేపన్స్ ని కొంచెం పైకెత్తి చూపించండి. మీ హైట్ కి, వయసుకి ఈ వెపన్ మీరు లిఫ్ట్ చేయలేరని వీళ్ళు అంటున్నారు. జస్ట్ మీరు దాన్ని ఎత్తగలరు అని చూపిస్తే చాలు అని అంటారు. అప్పుడు ఎదురుగా ఖైదీ మూవీలోని నెపోలియన్ ఆ వెపన్ ని ఎత్తడానికి కష్టపడుతూ కనిపిస్తారు. ఇక ఆ వెపన్ ఖైదీ మూవీ క్లైమాక్స్ లో డిల్లీ వాడిన మెషీన్ గన్.
Ads
Also Read: కొత్తగా రిలీజ్ అయిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?