ఛీ!ఛీ!! టీచర్ అయ్యుండి ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్స్…ఇది తప్పు అంటారా.?

Ads

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ చిన్న విషయం సోషల్ మీడియా ద్వారా పదిమందిలోకి వచ్చి చేరుతుంది. కంటికి కనిపించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో చేర్చడం, ఆ కంటెంట్ బాగుంటే నిమిషాల్లో వైరల్ అయిపోవడం జరుగుతుంది. దీనివలన కొందరు ఫేమస్ అయితే మరి కొందరు మాత్రం ట్రోల్స్ కి గురవుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా క్లాస్ రూమ్ లో ఒక టీచర్ ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేస్తుండుగా స్టూడెంట్స్ ఆమెని ఎంకరేజ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

అయితే ఒక టీచర్ క్లాస్ రూమ్ లో డాన్స్ చేయడాన్ని కొందరు ట్రోల్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమెని వెనకేసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. క్లాస్ రూమ్ లో టీచర్ బర్త్ డే వేడుకలు సెలబ్రేట్ చేస్తున్న క్రమంలో ఫుల్ ఖుషి అయిపోయిన ఆ టీచర్ బంటి ఔర్ బబ్లీ సినిమాలోని ఐశ్వర్యరాయ్ చేసిన ఐటెం సాంగ్ ఖజరారే పాటకి అదిరిపోయేలాగా డాన్స్ చేసింది.

Ads

ఆమె డాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆమెని మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంగా ఆ టీచర్ డాన్స్ చేయడం, ఆ డాన్స్ ని కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది కాస్తా వైరల్ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఆమె డాన్స్ చూసిన నెటిజన్స్ కొందరు ఫైర్ అవుతున్నారు. ఒక టీచర్ అయి ఉండి ఇలా ఐటమ్ సాంగ్స్ కి డాన్స్ చేయటం ఏంటి అని మండిపడుతున్నారు.  ఇలా ఐటెం సాంగ్ కి క్లాసులో డాన్స్ చేయడం సరి అయిన పద్ధతి కాదు అంటూ మండిపడుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఆ టీచర్ ని వెనకేసుకొస్తున్నారు. స్టూడెంట్స్ తో సరదాగా డాన్స్ చేస్తే తప్పేముంది, అయినా ఆమె డాన్స్ లో ఎక్కడా అసభ్యతకు చోటు ఇవ్వలేదు. ప్రజలు కొంచెం ఓపెన్ మైండెడ్ గా ఉండాలి అని టీచర్ ని వెనకేసుకొస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు.

Previous articleఈ 8 క్రికెటర్లకు హై ర్యాంకింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు వున్నాయి తెలుసా..?
Next article38 ఏళ్ల వయసులో కూడా ఈ హీరోయిన్ క్రేజ్ తగ్గలేదుగా.? 50 సెకండ్ల కోసం 5 కోట్ల రెమ్యూనరేషన్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.