Ads
లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార రెమ్యూనరేషన్ విషయంలో అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే నయనతార సౌత్ ఇండియాలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే తారగా రికార్డుల్లోకి ఎక్కింది. అలాగే భారీ స్థాయిలో ఒక యాడ్ కోసం రెమ్యూనరేషన్ తీసుకొని మరొకసారి రికార్డుల్లోకి ఎక్కింది నయనతార. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పద్ధతి సినీ తారలు ఎక్కువగా అవలంబిస్తూ ఉంటారు.
అయితే మరి ఈ రేంజ్ లో నా అని ఆశ్చర్యపోయేలాగా నయనతార రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నయనతార తాజాగా టాటా స్కై ప్రమోషన్ యాడ్ లో నటించినట్లు తెలుస్తోంది. కేవలం 50 సెకండ్ల కోసం నయనతార ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం బయటికి రావడంతో షాక్ అవ్వటం ప్రేక్షకుల వంతయింది. ఎందుకంటే స్టార్ హీరోలు సైతం ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోరు.అలాంటిది నయంతర తీసుకుంది అంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Ads
ఒకపక్క సినిమాలు, యాడ్స్ తోపాటు మరొకవైపు సొంత బిజినెస్ ని కూడా బ్రహ్మాండంగా నడిపిస్తూ రియల్ లైఫ్ లో కూడా లేడీస్ సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారు నయనతార. ఈమె ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లలో నటించదు, చాలా తక్కువ శాతం అడ్వర్టైజ్మెంట్లలో నటించడానికి ప్రయారిటీ ఇస్తారు. ఏదైనా సంస్థకే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటేనే వాటికి సంబంధించిన యాడ్స్ చేస్తారు. అందులో భాగంగా చేసిందే ఈ టాటా స్కై ప్రమోషన్ యాడ్.
సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటీమణులలో మొదటి స్థానంలో ఉన్న నయనతార ఆస్తులు 200 కోట్లకు పైమాటే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న అది కొద్ది మంది నటీమణులలో నయనతార ఒకరు. 38 ఏళ్ల వయసులో కూడా ఇంత క్రేజ్ ని సొంతం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయంలో నయనతారకి హాట్సాఫ్ చెప్పాల్సిందే.