వాష్ బేసిన్ కింద వైపు U షేప్‌లో పైపు ఉంటుంది చూసారా..? దాని వలన ఉపయోగం ఏమిటి అంటే..?

Ads

మనం ఉపయోగించే వస్తువులని ఎంతో గమ్మత్తుగా తయారు చేస్తూ ఉంటారు అలా తయారు చేయడానికి కారణాలు కూడా ఉంటాయి. వస్తువు యొక్క పనిని బట్టి డిజైన్ చేస్తూ ఉంటారు. దేనినైనా కూడా ఎందుకు అదే విధంగా డిజైన్ చేశారు అనేది చూస్తే మనం షాక్ అవుతూ ఉంటాము. ప్రతిరోజు మనం వాష్ బేసిన్ ని ఉపయోగిస్తాము. పళ్ళు తోముకోవడానికి మొదలు ముఖం కడుక్కోవడం ఇలా చాలా పనులు కోసం వాష్ బేసిన్ ని ఉపయోగిస్తూ ఉంటాం కంఫర్ట్ గా ఉంటుంది.

మనం వాష్ బేసిన్ ని ఉపయోగించేటప్పుడు మన బట్టలు తడిసిపోవు. టాప్ నుండి నేరుగా వాటర్ మన మీద పడదు. అయితే వాష్ బేసిన్ కి సంబంధించి చాలా మందికి తెలియని ఒక విషయం ఈరోజు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపు కాస్త వంకర తిరిగి ఉంటుంది. అంటే చూడడానికి ”యు” షేప్ లో ఉంటుంది.

Ads

ఎందుకు దాన్ని అలా డిజైన్ చేశారు దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అనేది చూస్తే.. యు షేప్ లో ఉండడం వలన ఎప్పుడు కూడా కొన్ని నీళ్లు ఉంటూ ఉంటాయి. ఆ నీళ్లు ఏం చేస్తాయి అంటే పైపు కిందకి కనెక్ట్ అయి ఉండే డ్రైనేజ్ నుంచి వచ్చే దుర్వాసనని ఆపుతాయి. డ్రైనేజ్ నుండి వచ్చే గ్యాస్ లు నేరుగా పైప్ ద్వారా పైకి రాకుండా ఉండడానికి ఆ పైపు కి అడ్డుకట్ట వేయాలి. అందుకే దాన్ని యూ షేప్ లో తయారు చేశారు సో ఎప్పుడూ కూడా కొంచెం నీళ్లు ఉంటాయి.

కాబట్టి కింద వైపు డ్రైనేజ్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ నీటి దగ్గరే ఆగిపోతుంది దీంతో గ్యాస్ పైకి రాదు. దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. యు షేప్ ఉండే చోటుని పీ ట్రాప్ అంటారు ఒకవేళ కనుక ఇది డామేజ్ అయితే అక్కడ నీళ్లు నిలువ ఉండవు. దుర్వాసన కూడా వస్తుంది. దుర్వాసన కూడా ఇంట్లోకి వస్తుంది. ఎప్పుడైనా సింక్ నుండి చెడు వాసనా వస్తే దీన్ని మీరు ఓ సారి చెక్ చెయ్యండి. టాయిలెట్ బేసిన్ కింద వైపు కూడా ఇది ఉంటుంది టాయిలెట్ లోకి డ్రైనేజ్ నుంచి దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.

Previous articleథియేటర్స్ లో I, O వరుసలు ఉండవు.. ఆ సీట్లు ఎందుకు వుండవు అంటే..?
Next articleVirupaksha Review: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్..!