Virupaksha Review: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్..!

Ads

సినిమా: విరూపాక్ష
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకత్వం : కార్తీక్ వర్మ దండు
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
సంగీతం : బి. అజనీష్ లోకనాథ్
విడుదల తేదీ :ఏప్రిల్ 21, 2023

స్టోరీ :

ఈ కథ 80, 90వ దశకంలో నాటిది. కొంచెం భయం ని తెప్పించే సెటప్ మరియు వయలెన్స్ తో ఈ సినిమా కథ స్టార్ట్ అవుతుంది. 1979 నేపథ్యంలో ఈ మూవీ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇది 1991 కి మారుతుంది. రుద్రవరం అనే ఊరు ఉంటుంది. ఆ గ్రామం లో వరుసగా మరణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దానితో ఎంతో భయానకంగా ఉంటుంది. రుద్ర‌వ‌రం అనే ఊరిలో అనుమానాస్పద మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. చేత‌బ‌డి వ‌ల‌న చ‌నిపోతున్నారా లేక ఇంకేమైనా కారణమా..? మిస్టరీని సూర్య (సాయి ధరమ్ తేజ్) చేదిస్తాడు. ఊరిని పట్టిపీడుస్తున్న శక్తి ఏంటి? హీరో ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఊరు ప్రజలకు ఎలా విముక్తి ని కలిపిస్తాడు..? ఇదే సినిమా కథ.

రివ్యూ:

ఈ మూవీ లో కొన్ని సీన్స్ అయితే వణుకు పుట్టిస్తాయి. 2 గంటల 25 నిమిషాల రన్ టైం తో ఈ మూవీ ని ఎంతో బాగా తీశారు. చక్కటి థ్రిల్లర్ జానర్ మూవీ ఇది. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కి మంచి కం బ్యాక్. డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని చక్కగా తెర మీదకి తీసుకు వచ్చారు. ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఎంతో ఉత్కంఠ భరితంగా వెళ్తూ ఉంటుంది.

Ads

టైటిల్ విషయానికి వస్తే.. రూపం లేని కన్నును విరూపాక్ష ( శివుడి మూడో కన్ను) అంటారు. హీరో రూపంలేని శక్తితో పోరాటం చేస్తాడు కనుక ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ పెట్టారు. ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ సంయుక్త ఎంతో అద్భుతంగా చేసింది. తేజ్, సంయుక్త మీనన్ కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. సంయుక్త పాత్ర ఈ సినిమా కి బాగా ప్లస్ అయింది.

ఓవర్ ఆల్ గా చూస్తే ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల కూడా వాళ్ళ పాత్రలని చక్కగా చేసారు. అఘోరాగా న‌టుడు అజ‌య్ అయితే ఇరగదీసాడు. `కాంతార` ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అయితే సూపర్బ్ గా వుంది. విజువల్స్, వీఎఫ్‌ఎక్స్, టెక్నికల్‌గా చూస్తే కూడా అన్నీ సెట్ అయ్యిపోయాయి. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే బాగుంది. ఆడియన్స్ కథలో నిమగ్నమైపోతారు.

ప్లస్ పాయింట్స్:

  • నటీనటులు
  • కథ
  • హైలెట్ అయిన కొన్ని సన్నివేశాలు
  • స్క్రీన్ ప్లే
  • బీజీఎమ్
  • అజనీష్ లోక్ నాథ్ సంగీతం
  • థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
  • సినిమాటోగ్రఫీ
  • సాయి ధరమ్ తేజ్, సంయుక్త పెర్ఫార్మెన్స్

మైనస్ పాయింట్స్:

  • సాగదీత సన్నివేశాలు
  • క్లైమాక్స్
  • లవ్ స్టోరీ
  • ముగింపు లో కాస్త నిరాశ
  • బోరింగ్ గా మొదటి హాఫ్

రేటింగ్: 3/5

Previous articleవాష్ బేసిన్ కింద వైపు U షేప్‌లో పైపు ఉంటుంది చూసారా..? దాని వలన ఉపయోగం ఏమిటి అంటే..?
Next articleసౌత్ ఆఫ్రికా వాడు అయ్యుండి.. ఫాఫ్ డూప్లెసిస్ అరబిక్ టాటూ ఎందుకు వేయించుకున్నాడు..?