థియేటర్స్ లో I, O వరుసలు ఉండవు.. ఆ సీట్లు ఎందుకు వుండవు అంటే..?

Ads

థియేటర్లలో సినిమా చూడడం చాలా బాగుంటుంది. చక్కటి సౌండ్ తో పెద్ద స్క్రీన్ ముందు కూర్చుని సినిమా చూస్తే కాసేపు సమయం తెలియదు. అందులో మంచి సినిమా మనకి ఇష్టమైన హీరో సినిమా చూస్తే ఇంకాస్త బాగుంటుంది. అభిమాన నటీ నటులు నటించిన సినిమాలని థియేటర్లో చూడాలని అందరికీ ఉంటుంది. అందుకనే అభిమానులు నటీనటుల సినిమా రిలీజ్ అయితే పట్టు పట్టి మరీ థియేటర్ కి వెళ్తూ ఉంటాం.

స్నేహితుడితో లేదా కుటుంబ సభ్యులతో కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది.థియేటర్లలో టికెట్లు బుక్ చేసుకునే టైం లో మనకి టికెట్ మీద ఏ సీట్లో కూర్చోవాలనేది రాస్తారు. థియేటర్లలో సీట్లు అన్నీ కూడా ఏ నుండి మొదలవుతాయి. ఇంచుమించుగా పీ వరకు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని గమనించారా ఇందులో రెండు అక్షరాలకు సంబంధించిన సీట్లు మిస్ అవుతూ ఉంటాయి.

Ads

థియేటర్లలో ఐ, ఓ (i, o) రెండు అక్షరాల వరుసలు కూడా మనకి కనపడవు. ఎందుకు ఈ వరుసలు ఉండవు అనే దాని వెనక కారణానికి ఇప్పుడు చూద్దాం.. టికెట్ మీద సీట్లను కేటాయించేటప్పుడు ఐ (I) అనే అక్షరాన్ని రాస్తే చాలా మంది అది వన్ అనుకుని పొరపాటు పడతారు. వన్ అనుకుని కన్ఫ్యూజ్ అయిపోతారని ఐ అనే వరుసని ఉంచరు.

ఇక ఓ విషయానికే వస్తే ఓ వరుసని కూడా ఉంచరు ఎందుకంటే ఓ (O) ని చూసి సున్నా అనుకుంటారు టికెట్ మీద ఓ అని రాస్తే చాలామంది దాన్ని సున్నాగా భావించొచ్చు. దీంతో కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని ఓ అక్షరంతో కూడా సీట్లు ఉండవు. ఐ ఓ రెండు వరుసలు కూడా మనకి కనపడవు. ఏ నుండి పి వరకు వరుసలు ఉంటాయి కానీ వీటిలో ఈ రెండు కూడా వుండవు. అందుకే థియేటర్లలో ఈ రెండు వరుసలు మిస్ అవుతూ ఉంటాయి చాలా థియేటర్లలో ఇలానే ఉంటుంది. కావాలంటే ఈసారి థియేటర్ కి వెళ్ళినప్పుడు గమనించండి.

Previous articleఎడమ చేతికే ఎందుకు వాచీ ని పెట్టుకోవాలి..? దాని వెనుక కథ ఏంటి అంటే..?
Next articleవాష్ బేసిన్ కింద వైపు U షేప్‌లో పైపు ఉంటుంది చూసారా..? దాని వలన ఉపయోగం ఏమిటి అంటే..?