మకర రాశిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోచ్చా..? ఏం అవుతుంది..?

Ads

ఎవరితోనైనా పెళ్లి జరపాలన్నా పెళ్లి మాటలు వచ్చినా మొదట జాతకాలు చూస్తారు. పెద్దలు జాతకాలు కలిస్తేనే పెళ్లి వరకు వెళ్తారు. జాతకాలు కనుక వధూవరులువి మ్యాచ్ అవ్వకపోతే పెళ్లి వద్దని చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే అమ్మాయి నక్షత్రం రాశి అబ్బాయి నక్షత్రం రాశి ఇవన్నీ చూసి పెళ్లి జరుగుతుంది.

అయితే మకర రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా..? మకర రాశి అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. మకర రాశి వాళ్ళు గొప్ప లక్ష్యాలని కలిగి ఉంటారు అందరితో కూడా వాళ్ళ హృదయాన్ని పంచుకోలేరు. మకర రాశి వాళ్ళు మనసుని అర్థం చేసుకోగల భాగస్వామి వీళ్ళకి అవసరం.

వీళ్ళ యొక్క భర్త ఖచ్చితంగా మంచి స్నేహితుడు అవ్వాలని వీళ్ళు కోరుకుంటారు. మకర రాశి వాళ్ళు నిజాయితీ నమ్మకం పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరి యొక్క కలలని సహకారం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు పైగా వీళ్ళ కలని సాకారం చేసుకోవడానికి సహకరించే జీవిత భాగస్వామి కోసం చూస్తూ ఉంటారు మకర రాశి మహిళలు.

Ads

మకర రాశి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అందర్నీ ఇష్టపడతారు, ఈ రాశి వాళ్ళు ఇతరులను కూడా ప్రోత్సహిస్తారు. అభినందిస్తారు. అలానే మకర రాశి వాళ్ళని వాళ్ళు సరదాగా ఎలా ఉంచుకోవాలో కూడా వారికి బాగా తెలుసు. మకర రాశి వాళ్ళ మనసు ఎంతో లోతుగా ఉంటుంది. చూడడానికి వీళ్ళు అమాయకంగా కనబడతారు. పట్టుదల వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మంచి మాటకారులు కూడా.

మకర రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోపంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని కనుక రెచ్చగొడితే పెద్ద గొడవ అవుతుంది కచ్చితంగా. అయితే వీరి యొక్క నిజమైన రూపాన్ని దగ్గర వాళ్లకు మాత్రమే చూపిస్తారు. అందరికీ నిజరూపం కనపడదు. మకర రాశి వాళ్ళు వారి యొక్క జీవిత భాగస్వామి ఎప్పుడు సపోర్టివ్ గా ఉండాలని అనుకుంటారు.

వీళ్ళకి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. వీరి ప్రేమను కూడా ఎప్పుడూ బయట పెట్టరు. సొంతవాళ్లు ఏదైనా ఒక మాట అంటే కూడా వీళ్ళ మనసు విరిగిపోతుంది. అందులో సందేహం లేదు. ఒక మాట కూడా వీళ్ళు పడనివ్వరు. ఓపికగా పనులు చేసుకుంటారు. ఏదైనా అభిప్రాయ బేధాలు వచ్చినా కూడా అన్యోన్యంగా జీవిస్తారు తప్ప బంధాన్ని ముక్కలు చేసుకోవాలని అనుకోరు. సర్దుకుపోతూ ఉంటారు. వీళ్ళకి జీవిత భాగస్వామి కనుక సపోర్ట్ ఇచ్చారంటే కచ్చితంగా గెలుపు తథ్యం.

Previous articleనూతన్ ప్రసాద్ మొదలు మహేష్ బాబు దాకా… షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన 10 మంది హీరోలు..!
Next articleచాణక్య నీతి: స్త్రీలు ఈ 5 విషయాలలో… పురుషుల కంటే ముందు ఉంటారు..!