Ads
ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టం సుఖం రెండు ఉంటాయి. ఈ రెండు ఉంటేనే జీవితం. అయితే ఏది ఎప్పుడు వస్తుందనేది ఎవరు ఊహించలేము ఒకసారి కష్టం వస్తే మరోసారి ఆనందం వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే ఎవరికైనా కష్టం వస్తే మొదటే గుర్తొచ్చేది భగవంతుడు. భగవంతుడి మీద భారం వేసి ఆ సమస్య నుండి గట్టెక్కించమని కోరుతూ ఉంటారు దానికి పరిహారంగా ఏదో ఒక మొక్కు పెట్టుకుంటూ ఉంటారు.
అనుకున్నట్టుగా జరిగితే దేవుడికి మొక్కు తీర్చుకుంటారని వాగ్దానం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళల్లో చాలా మంది మర్చిపోతూ ఉంటారు.
చాలా తక్కువ మంది మాత్రమే మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి మొక్కుకున్న తర్వాత దానిని తీర్చకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మొక్కిన మొక్కు తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి నిజంగా దేవుడికి కోపం వస్తుందా అంటే.. లేదు. మొక్కిన మొక్కులు కోరిక తీరిన తర్వాత తీర్చకపోతే దేవుడికి కోపం రాదు. దేవుడికి భక్తులు పిల్లలతో సమానం.
Ads
ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లల మీద కోపం చూపించరో దేవుడు కూడా భక్తులు మీద ఎటువంటి కోపం చూపించడు అయితే మొక్కు మాత్రం కష్టాలు వస్తే మనిషి దారి ఎటువైపు ఉంది… సుఖం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది మనిషి మాట మీద ఎలా నిలబడుతున్నాడు అని ఎవరికి వారు తెలుసుకోవడానికి మొక్కు ఉపయోగపడుతుంది. మొక్కులు మనిషి ఇచ్చిన మాట మీద నిలబడుతున్నాడా లేదా అనేది చెప్పడానికి వచ్చాయి. ఎంతవరకు మనిషి ఇచ్చిన మాట మీద నిలబడుతున్నాడు అనే దాని కోసం మొక్కులు మనకి ఉన్నాయి అని పండితులు అంటున్నారు.
అంతేకానీ మనం మొక్కు తీర్చకపోతే దేవుడికి మీద కోపం వస్తుందనేది నిజం కాదు. మొక్కిన మొక్కుని ఒక మాట కింద భావించి దాని మీద నిలబడాలి తప్ప హాస్యంగా తీసుకోకూడదు. ఇది మనకి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి తప్పుడు ముక్కులు మొక్కుకోకూడదు. ఇచ్చిన మాట మీద నిలబడాలి. అయితే దేవుళ్లను ఎన్ని మొక్కులు మొక్కిన జీవితంలో కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని ప్రతి ఒక్కరూ గమనించాలి.