మన 5 రూపీస్ కాయిన్స్ తో “బంగ్లాదేశ్‌” అలా చేసేసరికి…ఆ కాయిన్స్ ని ఇండియా లో బ్యాన్ చేసారని తెలుసా?

Ads

ప్రస్తుతం మార్కెట్లో పాత రూ.5 నాణేలు అంతగా కనిపించడం లేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటికి బదులుగా గోల్డ్ కలర్ కాయిన్స్ మందం తక్కువగా ఉన్న కాయిన్స్ ప్రస్తుతం చలామణి అవుతున్నాయి. పాత రూ.5 నాణేం బరువు తొమ్మిది గ్రాములు ఉంటుంది. కానీ ఇప్పుడు మన వద్ద ఉన్న ఆ గోల్డ్ కలర్ కాయిన్ అంత మందము బరువు రెండు ఉండవు.

అయితే పాత రూ.5 కాయిన్లు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి? అనే ప్రశ్న మీలో చాలామందికి తలెత్తే ఉంటుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. బంగ్లాదేశ్‌కి పాత రూ.5 నాణేలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ముద్రణను నిలిపివేసింది.

రూ.5 నాణేల స్మగ్లింగ్‌ వెనుక రూ.కోట్లలో వ్యాపారం ఉంది. కప్రో-నికెల్‌ తో తయారు చేసిన పాత 5 రూపాయల నాణేలను బంగ్లాదేశ్‌కు స్మ-గ్లింగ్ చేస్తున్నారు. దాంతో అవి మార్లెట్లో కనిపించకుండా పోతున్నాయి. వాటి చలామణి దాదాపుగా కనుమరుగైంది. అయితే, ఈ నాణేలను బంగ్లాదేశ్‌కు తరలించి వాటిని కరిగించి దాంతో రేజర్ బ్లేడ్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఐదు రూపాయల కాయిన్ తయారు చేసే పదార్థాలతోనే బ్లేడ్లు తయారు చేస్తున్నారట. ఒక్క రూ.5 నాణెంతో 6 బ్లేడ్లు తయారు చేస్తున్నారట. అంటే ఒక్క బ్లేడ్ రూ.2కు విక్రయిస్తున్నారట. రూ.5 కాయిన్‌ తో రూ.12 రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట.

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపడుతూ.. రూ.5 నాణేల తయారీకి వాడే మెటల్స్‌ని మార్చాలనే ఆదేశించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత కాయిన్స్‌తో పోలిస్తే సన్నగా ఉండేలా కొత్త రకం నాణేలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటిని మార్కెట్లో తక్కువ ధరకే లభించే మెటల్స్‌తో తయారు చేస్తోంది. కొత్త కాయిన్స్‌ను స్మగ్లింగ్ చేసినా వాటితో రేజర్ బ్లేడ్లు తయారు చేయలేరు.

Ads

 

View this post on Instagram

 

A post shared by Chandu Kodali (@chandu_kodali_7)

Previous articleNRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 8 మంది టాలీవుడ్ హీరోయిన్లు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!
Next articleమొక్కుకుని తీర్చకపోతే ఏం అవుతుంది..? సమస్యలు వస్తూ ఉంటాయా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.