Ads
సాధారణంగా ట్రైన్‌లో సీట్ ను రిజర్వేషన్ చేసుకొన్నప్పుడు ఆ ట్రైన్ ని ఒకవేళ మిస్సయినప్పుడు, ఆ సీటు ఎవరికి ఇస్తారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మరి బుక్ చేసుకున్న తరువాత వచ్చే స్టేషన్‌లో ఆ ట్రైన్ ఎక్కితే తాము రిజర్వ్ చేసుకున్న సీటు తమకే ఇస్తారా? లేదంటే వేరే ఎవరికైనా ఆ సీటును ఇస్తారా అని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం ..
Ads
ఇండియాలో ప్రతిరోజూ లక్షల మంది ట్రైన్స్ లో ప్రయాణం చేస్తున్నారు. ఇలా ప్రయాణించె వారిలో ఎవరైనా ఇప్పుడో ఒకసారి టికెట్ బుక్ చేసుకుని, ఆ తరువాత ఆ ట్రైన్ ను మిస్ అవుతుంటారు. అయితే ట్రైన్‌లో సీట్ ను బుక్ చేసుకొన్న తరువాత అది మిస్సయినపుడు ఆ బుక్ చేసుకున్న సీటు ఎవరికి ఇస్తారు అనే విషయంలో చాలామందికి తెలియదు.
ఇక ఇండియన్ ట్రైన్‌లలో సీట్ రిజర్వ్ చేసుకుని, ఒకవేళ ఆ ట్రైన్ మిస్ అయినట్లయితే ఆ సీటును వేరొక ప్రయాణికుడికి ఇస్తారు. అయితే రిజర్వ్ చేసుకున్నవాళ్ళు వేరే స్టేషన్ లో ఆ ట్రైన్ ఎక్కడం వీలయితే, ఆ సీటు రిజర్వ్ చేసుకున్నవాళ్ళకే ఉంటుంది. రిజర్వ్‌డ్ సీటు ఉండి, ట్రైన్ ను మిస్సయితే మాత్రం ట్రైన్ టిక్కెట్ ఎగ్జామినర్ ఆ సీటును వేరొక ప్యాసింజర్ కు కేటాయించవచ్చు. ఒకవేళ సీట్ రిజర్వ్ చేసుకున్న వ్యక్తి వేరొక వెహికల్ ద్వారా ట్రైన్ చేరేలోపు నెక్స్ట్ స్టేషన్‌కు చేరుకున్నట్లయితే, అప్పటికీ ఆ వ్యక్తి అదే సీటులో కూర్చోవచ్చు. ఒకసారి టికెట్ కన్ఫర్మ్ అయిన తరువాత ఆ సీటు తరువాత వచ్చే రెండు స్టేషన్ల వరకు కూడా రిజర్వ్ చేసుకున్న వ్యక్తి కోసం ఖాళీగా ఉంచుతారు.
అప్పటికి ఆ వ్యక్తి ఎక్కనట్లయితే ట్రైన్ టిక్కెట్ ఎగ్జామినర్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి ఆ సీటును కేటాయించవచ్చు. ఒకవేళ టికెట్ రిజర్వ్ చేసుకుని, ఆ ట్రైన్ మిసయినపుడు దాన్ని అందుకోలేకపోతే టిక్కెట్ ధరలో సగం డబ్బు కోసం రీయింబర్స్‌మెంట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అయితే రైలు మొదలయ్యే స్టేషన్ నుండి అది స్టార్ట్ అయిన 3 గంటల తరువాత రిజర్వ్ చేసుకున్న టిక్కెట్‌ను క్యాన్సిల్ చేయాలి. టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ని ఇచ్చి, తద్వారా రీయింబర్స్‌మెంట్ ను పొందవచ్చు. అనగా టికెట్ కోసం ఖర్చు పెట్టిన దాని నుండి సగం డబ్బు తిరిగి వస్తుంది.
Also Read: రైలు బ్రేకుని ఎందుకు సడన్ గా వెయ్యరు..? ఇంత ప్రమాదం జరగవచ్చా..?