రైలు బ్రేకుని ఎందుకు సడన్ గా వెయ్యరు..? ఇంత ప్రమాదం జరగవచ్చా..?

Ads

రైలులో ప్రయాణం చేయడం ఎంతో బాగుంటుంది. చాలా మంది అందుకే రైలులో ప్రయాణం చేయడానికి చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలులో వెళ్లడం మంచిది. సౌకర్యంగానే కాకుండా సురక్షితంగా మనం ప్రయాణం చేయొచ్చు. పైగా ప్రయాణంలో ఎలాంటి చిరాకు మనకి కలగదు. అయితే రైలు ప్రయాణానికి సంబంధించి మనకి తెలుసు.

కానీ రైలు నడిచే విధానం గురించి మనకి తెలియకపోవచ్చు. చాలా మందికి ఎక్కువగా ఉండే సందేహం ఏమిటంటే రైలు బ్రేక్ సడన్ గా ఎందుకు వేయరు అని…

మీకు కూడా ఎప్పటి నుండో ఈ సందేహం ఉందా..? అయితే ఇప్పుడే ఆ సందేహాన్ని క్లియర్ చేసుకోండి. మామూలుగా కారుకి కానీ బస్సుకి కానీ బండికే కానీ మనం బ్రేక్ వేస్తే ఆ బండి మాత్రమే ఆగుతుంది. అయితే ఇవి చాలా చిన్న వాహనాలు. అవి రైలులో సగం కూడా ఉండవు. చాలా పెద్దదిగా ఎక్కువ బోగీలతో ఉంటుంది రైలు బండి. బోగీలతో రైలు ఉంటుంది కాబట్టి సడన్ గా బ్రేక్ వేయడం వలన సమస్య వస్తుంది. నిజానికి రైలుని సడన్ గా ఆపితే వేలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.

Ads

అందులో సందేహం లేదు. ఇంజన్ వేగం కనుక తగ్గిందంటే మిగతా బోగీలు కూడా అదే దశలో వేగంగా కదిలి ఒక దాని మీద ఒకటి ఎక్కే ఛాన్స్ ఉంది.  ఇది ఎంతో ప్రమాదం కదా..? రైళ్లలో ఉండే బ్రేక్ సిస్టం వ్యాక్యూమ్ ప్రెషర్ తో ఉంటుంది. అన్ని భోగిలు ఒకే ట్యూబ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అయితే భోగిల్లో ఉండే వ్యక్తుల దగ్గర ఎమర్జెన్సీ బ్రేక్ వ్యవస్థ ఉంటుంది. అయితే వాక్యూమ్ లోపల ఉండే పీడనం తగ్గిస్తే బ్రేక్ ఉపయోగం లోకి వస్తుంది అంటే బ్రేక్ పనిచేస్తుంది.

ఒకేసారి ఈ రైలు వేగం తగ్గాల్సి ఉంటుంది. లేకపోతే లోపల ఉన్న వాళ్ళకి రిస్క్ ఉంటుంది. బోగీలు పట్టాలు తప్పిపోయే అవకాశం కూడా ఉంది. బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది రైలు పొడవు దాని యొక్క పరిణామం దాని యొక్క వేగం బట్టి వుంటుంది. కొన్ని కొన్ని సార్లు రైలు ఆగడానికి 500 మీటర్లు లేదంటే ఒక కిలోమీటర్ల వరకు కూడా పడుతుంది కాబట్టి ఎప్పుడూ పట్టాలు దాటద్దు ఇది నిజంగా ప్రమాదకరం.

Previous articleఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు.. బిజినెస్ లో కోట్లు సంపాదిస్తున్న ఆ హీరోయిన్ ఎవరంటే..?
Next articleఎమ్మెల్యే “యశస్విని మామిడాల”కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.