Ads
సెలబ్రిటీల జీవితాలు తెరిచిన పుస్తకాల లాంటివి అని అంటారు. వాళ్ల గురించి ఏ విషయమైనా సరే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. వాళ్లు కూడా తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలని తమ అభిమానులకు చెప్పడం అనేది ఒక బాధ్యతగా భావిస్తారు. అందుకే వారి వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల గురించి ప్రేక్షకులకు చెప్తారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అందరూ యాక్టివ్ గా ఉంటారు. ఒకవేళ వాళ్ళు యాక్టివ్ గా లేకపోయినా కూడా సెలబ్రిటీ న్యూస్ వస్తూనే ఉంటాయి.
ఈ కారణంగా సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతోంది అనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ల జీవితాల్లో ఏదైనా గొడవలు జరిగినా కూడా అది బయటికి వచ్చేస్తుంది. కానీ సెలబ్రిటీలు మాత్రం ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు అంటే ముందుగా చెప్పుకోవలసినది వాళ్ళ రిలేషన్ షిప్స్ గురించి. ఒక సెలబ్రిటీకి తన తల్లిదండ్రులతో ఎలాంటి బంధం ఉంది, తన పార్ట్నర్ తో ఎలాంటి బంధం ఉంది అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో తెలిసిపోతూ ఉంటాయి. సెలబ్రిటీ కపుల్ మధ్య గొడవలు అయితే అది కూడా వాళ్ళు చెప్పకుండానే తెలిసిపోతుంది.
సెలబ్రిటీలు వాళ్ల భాగస్వామితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి సాధారణ ప్రజలు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని అనుకుంటారు. వాళ్ళని చూసి ఆదర్శ దంపతులు అని అనుకుంటారు. వాళ్ళు ఇంటర్వ్యూలలో ఒకరి గురించి ఒకరు పొగిడే విధానం చూసి పార్ట్నర్ ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్లు ఆనందంగా ఉంటారు అని ప్రేక్షకులు ఆనందపడే సమయంలోనే వాళ్లు విడిపోతున్న ప్రకటిస్తారు. ఇటీవల ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి.
Ads
ఈ వార్త బయటకు వచ్చే ముందు వరకు ఆ సెలబ్రిటీ కపుల్ చాలా ఆనందంగా ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి విడాకుల విషయం బయటకు వచ్చాక వాళ్ళ జీవితంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నాయో మెల్లమెల్లగా బయటకి వస్తూ ఉంటాయి. ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు జీవీ ప్రకాష్ కూడా సైంధవితో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇందుకు కారణం కూడా మానసిక ప్రశాంతత కోసం విడిపోతున్నట్టు చెప్పారు.
మొన్నటి వరకు జీవీ ప్రకాష్ చాలా సంతోషంగా తన కుటుంబంతో ఉన్నట్టు అందరూ అనుకున్నారు. కానీ మానసిక ప్రశాంతత కోసం ఒకరి నుండి ఒకరు విడిపోవాల్సిన అంత ఇబ్బందులు ఉన్నాయి అని ఇప్పుడు అర్థం అవుతోంది. అయితే సెలబ్రిటీలు చెప్పేవి అబద్ధాలేనా? సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసేవి ఏవి నిజం కాదా?
పైకి నవ్వుతూ ఉన్నా కూడా లోపల వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయా? అవన్నీ మనకి కనిపించనివ్వకుండా పరిష్కరించుకుంటూ ఉంటారా? కానీ వాళ్ళని చూసి ఆదర్శ దంపతులు అని అనుకునేది మనం. అంటే ఇక్కడ పొరపాటు పడేది మనం. సెలబ్రిటీలు కూడా మామూలు మనుషులే. వాళ్లకి కూడా సమస్యలు ఉంటాయి అని మనం మర్చిపోతున్నాం. సోషల్ మీడియాలో చూపించేవి అన్నీ కూడా నిజం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు వీళ్ళందరిని చూస్తే ఇలాగే అనిపిస్తుంది ఏమో.