Ads
కొంత మంది సినీ నటీనటులు సంవత్సరాల తరబడి సినిమాలు చేయకపోయినా కూడా ప్రేక్షకులకి గుర్తుంటారు. అలా ఒక నటి సినిమాల్లో కనిపించి చాలా కాలం అయినా కూడా ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెని గుర్తు పెట్టుకున్నారు. అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఆమెని ప్రేక్షకులు అంగీకరించారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు. కళ్యాణి. కబడ్డీ కబడ్డీ సినిమాతో కళ్యాణి ఎంతో పేరు సంపాదించుకున్నారు. కళ్యాణి స్వతహాగా మలయాళీ వారు. కళ్యాణి పేరు కావేరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కళ్యాణి చాలా సినిమాల్లో నటించారు. 1996 లో ఉద్యానపాలకన్ అనే సినిమాలో మొదటి సారిగా హీరోయిన్ గా నటించారు కళ్యాణి.
ఆ తర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తర్వాత కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించారు. 2002 లో వచ్చిన శేషు కళ్యాణి మొదటి తెలుగు సినిమా. రాజశేఖర్ ఈ సినిమాలో హీరోగా నటించారు. అదే సంవత్సరం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో కూడా కళ్యాణి నటించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో, రవితేజ హీరోగా నటించిన. ఈ సినిమా చాలా పెద్ద విజయం అందుకుంది. శేషు సినిమాలో కూడా కళ్యాణి నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి.
Ads
తర్వాత తెలుగులో కబడ్డీ కబడ్డీ, లేత మనసులు, పెదబాబు, ధన 51, పందెం, శ్రావణమాసం, హోప్, ఆపరేషన్ దుర్యోధన, లక్ష్యం, మున్నా, రక్ష సినిమాల్లో నటించారు. లక్ష్యం సినిమా నుండి కళ్యాణి సహాయ పాత్రల్లో నటించడం కూడా మొదలు పెట్టారు. జగపతిబాబు, కళ్యాణి ఎన్నో సినిమాల్లో నటించి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా తెలుగులో చాప్టర్ సిక్స్, కారా మజాకా, బ్రహ్మలోకం టు యమలోకం వయా, భూలోకం, ఓనమాలు, అజ్ఞాతం, లెజెండ్, రా రా కృష్ణయ్య, ఓ మనిషి కథ, విన్నర్, టాక్సీవాలా, యాత్ర సినిమాల్లో నటించారు.
వీటన్నిటిలో కూడా ముఖ్య పాత్రల్లో మాత్రమే కళ్యాణి నటించారు. కళ్యాణి తెలుగులో చివరిగా 2019 లో వచ్చిన యాత్ర సినిమాలో కవిత తల్లి పాత్రలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించలేదు. 2010 లో కళ్యాణి ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ ని పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారు.
2020 లో కళ్యాణి దర్శకురాలిగా కూడా తన ప్రయాణం మొదలు పెట్టారు. ఈ సినిమా పలు భాషల్లో రూపొందుతున్నట్టు ప్రకటించారు. చేతన్ చీను హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కానీ సినిమాల్లో మాత్రం కళ్యాణి అప్పటి నుండి కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే కళ్యాణి దర్శకత్వ పనిలో ఉన్నారు అని తెలుస్తోంది.
ALSO READ : వెంకటేష్ ”నువ్వు నాకు నచ్చావ్” మూవీని ఎన్నోసార్లు చూసినా ఈ మిస్టేక్ ని గమనించలేదు..!