వాచీలు, గడియారాల్లో డిఫాల్ట్ గా ”10 :10” అని ఎందుకు ఉంటుంది..?

Ads

సాధారణంగా వాచీలు మరియు గడియారాల్లో టైం ను చూస్తుంటే డిఫాల్ట్ గా 10 :10 అని ఉంటుంది. ఇలా ఉండడానికి చాల రకాల కారణాలు ఉంటాయి. అయితే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అపోహలు

గడియారం లో డిఫాల్ట్ టైం వెనుక ఎన్నో అపోహలు వున్నాయి. గడియారం కనుగొన్న వ్యక్తి 10 :10 కి చనిపోవడంతో డిఫాల్ట్ గా అదే సమయాన్ని ఫాలో అవుతున్నారు అని అపోహపడుతూ ఉంటారు. మరి కొందరైతే గడియారాన్ని రూపొందించిన వ్యక్తి ఏ సమయానికి అయితే పుట్టారో ఆ సమయాన్ని డిఫాల్ట్ గా ఉపయోగిస్తున్నారని అంటారు. మరి అసలు నిజం ఇది కాదు గడియారం ను ఆవిష్కరించడం వల్ల ఇది డిఫాల్ట్ గా లేదు. నిజానికి ఈ సమయం డిఫాల్ట్ గా ఉండడానికి మరియు రూపొందించిన వ్యక్తి కి ఎలాంటి సంబంధం లేదు.

  1. చనిపోయిన అమెరికన్ ప్రెసిడెంట్ తో సంబంధం..?

అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ మరియు జాన్ ఎఫ్ కెన్నెడీ లు ఈ సమయానికే చనిపోవడం వల్ల 10 :10 ను డిఫాల్ట్ గా దీన్ని ఉపయోగిస్తున్నారని అనుకుంటారు.

నిజం ఏమిటి..?

నిజానికి ఆ ప్రెసిడెంటులు ఆ సమయానికి చనిపోలేదు.

2. హిరోషిమా మరియు నాగసాకి ట్రాజెడీ..?

ఈ థియరీ ప్రకారం అటామిక్ బాంబ్స్ అనేవి 10 :10 కి జరగడం వల్ల డిఫాల్ట్ గా ఉపయోగిస్తున్నారు. అయితే నిజానికి ఈ సమయానికి మాత్రం ట్రాజడీ జరగలేదు అని చరిత్ర చెబుతోంది.

నిజం ఏమిటి..?

1945 ఆగస్టు 6, 9 తేదీలలో హిరోషిమా నాగసాకిపై వరుసగా ఉదయం 8:15 మరియు 11:02 గంటలకు ఆటం బాంబ్స్ వేశారు.

3. విక్టరీ సింబల్..?

Ads

విక్టరీ సింబల్ వరల్డ్ వార్ టు జరిగిన తర్వాత ”వి” అనే అక్షరం ఎంతో పాజిటివిటీ మరియు హోప్ ను ఇస్తుందని ఈ సింబల్ ను ఎక్కువ గా ఉపయోగించేవారు. అయితే గడియారం లో ఎప్పుడైతే 10 :10 అవుతుందో అప్పుడు గడియారం ముళ్ళు ”వి” అనే అక్షరాన్ని సంకేతీస్తాయి. ఈ విధంగా విక్టరీ సింబల్ ను తెలియజేస్తుందని డిఫాల్ట్ గా ఉపయోగిస్తారు అని తేలింది.

నిజం ఏమిటి..?

నిజానికి దీని వెనుక ఎటువంటి ఎవిడెన్స్ లేదు.

ఈ విధంగా అందరూ 10:10 ని డిఫాల్ట్ సమయంగా ఉపయోగిస్తుంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు మరియు కేటలాగ్స్ కూడా అదే థియరీ ను పాటించరు. కానీ దాని వెనుక కారణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే timex బ్రాండ్ మాత్రం ఈ థియరీ ను పాటించకుండా 8:20 ను డిఫాల్ట్ సమయంగా ఉపయోగించి వాచీలు కి ఫోటోలు తీసారు. అయితే ఇలా చేయడం వల్ల వాచీలు ఫోటోలు సరిగా ఉండకపోవడంతో తిరిగి 10:10 ని డిఫాల్ట్ సమయంగా ఉపయోగించారు.

Wall clock isolated on white background. Ten past ten

మరి ఈ సమయం వెనుక అసలు నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే 10:10 ని డిఫాల్ట్ సమయంగా ఉపయోగిస్తారో అప్పుడు టైం క్లియర్ గా కనబడుతుంది. గడియారంలో ఉండేటువంటి ముల్లులు కూడా ఓవర్ లాప్ అవ్వకుండా సరైన విధంగా డిస్ప్లే అవుతాయి. దీంతో వాచీ యొక్క షేప్ మరియు డిజైన్ కూడా ఎంతో అందంగా కనబడుతుంది. మార్కెట్లు మరియు బ్రాండ్ పరంగా చూసుకుంటే 10:10 ని డిఫాల్ట్ సమయంగా పెట్టడం వల్ల బ్రాండ్ యొక్క లోగో సరైన విధంగా కనబడుతుంది. కొన్ని రకాల వాచీలకు డేట్ మరియు ఇతర ఇండికేటర్లు ఉంటాయి అయితే వాటికి కూడా ఎలాంటి అడ్డు కలగకుండా ఈ డిఫాల్ట్ సమయం ఉపయోగపడుతుంది అందుకే దీన్ని అందరు ఫాలో అవుతారు.

Previous articleఅసలు ”టీ” మన దేశ ప్రజలకి.. ఎలా అలవాటు అయ్యిందో తెలుసా..?
Next articleభారీ అంచనాలతో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్లుగా మిగిలిపోయిన చిరంజీవి 4 సినిమాలు ఇవే..!