Ads
నందమూరి తారకరత్నను పెళ్లి చేసుకోక ముందు అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసేవారు. అయితే తారకరత్నను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆమెకు పాపులారిటీ వచ్చింది. కాగా అలేఖ్య రెడ్డికి తారకరత్నతో పరిచయం కాక ముందే పెళ్లి జరగడం, కొన్ని వివాదాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగిపోయాయి.
Ads
ఆ తర్వాత కాలంలో తారకరత్నను ప్రేమించి, వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్ళితో తారకరత్న ఫ్యామిలీ వీరికి దూరమయ్యారు. దానికి కారణం ఇద్దరి కులం వేరు. అంతే కాకుండా విడాకులు తీసుకున్న అలేఖ్యని వివాహం చేసుకోవడంతో, తారకరత్న తండ్రి మోహనకృష్ణ తారకరత్న ఫ్యామిలిని గత పది ఏళ్లుగా దూరం పెట్టారు. అయితే తారకరత్న మరణంతో ఆయన భార్య, వారి పిల్లలు ఒంటరి అయ్యారు. ఈ క్రమంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గురించిన చాలా విషయాలు ప్రస్తుతం వైరల్ గా అవుతున్నాయి.
భర్త మరణంతో తీవ్ర దుఖంలో ఉన్న అలేఖ్య రెడ్డిని చూసిన వారి గుండె తరుక్కుపోతుంది. ఈ నేపద్యంలోనే ఆమెకు ఎవరు అండగా నిలుస్తారు. అండగా నిలిచే ఫ్యామిలి ఎక్కడ? ఆమె కుటుంబం ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఇలాంటి వివరాల గురించి ఫ్యాన్స్ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే అలేఖ్య రెడ్డి ఎవరు అంటే, వైసీపీ పార్టీలో ముఖ్యనేత అయిన ఎంపీ విజయసాయి రెడ్డి వైఫ్ చెల్లెలి కుమార్తెనే అలేఖ్య రెడ్డి.
ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం. అలేఖ్య తండ్రి పేరు మధుసూదన్ రెడ్డి. ఇక ఆయన ఆర్డిఓగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత అలేఖ్య కుటుంబం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అలేఖ్య రెడ్డికి చెల్లి, సోదరుడు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు హైదరాబాద్ వచ్చాకే అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ని మొదలు పెట్టింది. అలా అలేఖ్య రెడ్డి తారకరత్న ‘నందీశ్వరుడు’ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది. ఆ క్రమ్మలో ఎరపడిన పరిచయం, ప్రేమకు దారి తీసింది. వీరు సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు.Also Read: ఎన్టీ రామారావు, తారకరత్న మరణాలకు మధ్య ఉన్న పోలిక ఏమిటో తెలుసా..!